KTR( image Credit: swetch reorter)
Politics

KTR: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగం.. కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR: మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ లతో రాబోయే 50ఏళ్లలో హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన కేసీఆర్ పై సీబీఐ విచారణ జరపడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీబీఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, కాంగ్రెస్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితి, ద్వంద వైఖరీనికి నిదర్శనం అన్నారు. మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులుబుధవారం ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పదేళ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 Also Read: Curd: పెరుగు లేకుండా ఇలా సులభంగా పాలు తోడు పెట్టొచ్చని తెలుసా?

 రైతులను తీవ్రంగా యూరియా కొరత 

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారన్నారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఢిల్లీకి పోతే తనను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని అనడం, పేగులు మెడలో వేసుకుంటా లాంటి మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు.

చేతకాక సాకులు వెతుకుతున్నారు

దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవన్నారు. కాంగ్రెస్ సన్నాసులకు పనిచేయడం చేతకాక సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. అప్పులపై కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పినా సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలునుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వారసత్వ ఉద్యోగాలు కల్పించడం నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్ని విధాలా అండగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు.

పార్టీపై ప్రభావం చూపించాయా?

పార్టీకి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు మధ్య సమన్వయం లోపించిందా? యూనియన్ అంతర్గత రాజకీయాలు పార్టీపై ప్రభావం చూపించాయా? అనే కోణంలో ఆనాడు చర్చించామని చెప్పారు. పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్‌లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రాచలం, కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మోసాలను, బీజేపీతో పొంచి ఉన్న ముప్పును ప్రజలకు వివరించాలన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి, అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడమే శరణ్యం అన్నారు.

 Also Read: Rappa Rappa Video: వినాయకుడిపై రప్పా రప్పా రాతలు.. ఎరుపు రంగుతో.. గొడ్డలి గుర్తువేసి ఊరేగింపు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం