Mulugu SP Shabarish: ములుగు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని డాక్టర్ పి. శబరీష్SP Shabarish) పేర్కొన్నారు. ములుగు జిల్లా(Mulugu District)లోని మంగపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సందర్శించారు. కంప్యూటర్ సిబ్బంది పనితీరును పరిశీలించి ఎటువంటి పని పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫైల్ లు ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు.
Also Read: Damodar Reddy: ఎమ్మెల్యేగా పదేళ్లు భ్రష్టుపట్టించావు.. మర్రిపై ఎంఎల్సీ కూచుకుళ్ల ఫైర్
హెల్మెట్ ధరించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మరియు సిబ్బంది కూడా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరయిన గంజాయికి, మాదక ద్రవ్యాలకు బానిస అయితే వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. సైబర్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలి
గెమింగ్, బెట్టింగ్ అప్లికేషన్ లు వాటి ద్వారా జరిగే మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. వాటి బారిన పడి ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలి అని ఆదేశాలు జారీ చేశారు. యాక్సిడెంట్ మరియు తదితర కేసులలో స్వాధీన పరుచుకున్న వాహనాలను పరిశీలించి, అట్టి వాహనాలను వాహన యజమానులకు అందజేయాలని ఆదేశించారు. సిబ్బoది ప్రతీ ఒక్కరిని విడివిడిగా వారు నిర్వహించే విధులను గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందివ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. తనిఖీలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ఏటూరు నాగారం సిఐ శ్రీనివాస్, ఎస్ బి ఇన్స్పెక్టర్ శంకర్, మంగపేట ఎస్హెచ్ఓ టివిఆర్ సూరి సీఐ, ఇతర అధికారులు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Ileana: మళ్లీ నటిగా మీ ముందుకు వస్తా.. కాకపోతే..? రీ ఎంట్రీపై ఇలియానా కామెంట్స్