CM Revanth Reddy: కవిత ప్రెస్ మీట్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హరీశ్ రావు (Harish Rao) వెనక తాను ఉన్నానంటూ కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలను రేవంత్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని బతకనివ్వకూడదని ఆనాడు అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ (BRS)పై మండిపడ్డారు. ఇవాళ వాళ్లే తన్నుకొని చస్తున్నారని సెటైర్లు వేశారు. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని విమర్శించారు.
‘చెత్తగాళ్ల వెనక నేనెందుకు ఉంటా’
బీఆర్ఎస్ నేతలకు బయట వారు అక్కర్లేదని.. వాళ్లను వాళ్లే పొడుచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాను. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆయన వెనుక ఈయన…
ఈయన వెనుక ఆయన ఉన్నాడని అంటున్నారు.అంత చెత్తగల్ల వెనుక నేను ఎందుకు ఉంటా…
దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ, కుల పంచాయతీ లోకి మమ్మల్ని లాగండి.#RevanthReddy #Kavitha pic.twitter.com/CyEkvYFRPR
— Congress for Telangana (@Congress4TS) September 3, 2025
Also Read: India vs Pakistan: భారత్‌తోనే కాదు.. ప్రధానులు వాడే విమానాల్లోనూ.. పాక్ దిగదుడుపే..
‘మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు’
వాళ్లకు వాళ్లే కత్తులతో పొడుచుకొని తాను వెనక ఉన్నానంటూ లాగడమేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే.. లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు. మీరంతా దిక్కుమాలినవారని తెలిసి తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయతీలోనో.. మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read: Indian Railways: స్వర్గానికి కేరాఫ్‌గా నిలిచే రైల్వే స్టాప్స్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!
రేవంత్ గురించి కవిత ఏమన్నారంటే?
అంతకుముందు ప్రెస్ మీట్ లో మాట్లాడిన కవిత.. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి మాజీ మంత్రి హరీశ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు అతడికి సీఎం రేవంత్ రెడ్డి సాయం చేస్తున్నారని విమర్శించారు. ‘హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లినప్పుడు నుండి మా కుటుంబం పైన కుట్ర జరిగింది. హరీష్ రావు.. రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడిన తర్వాత నా పైన ఇంత పెద్ద కుట్ర చేశారు. హరీష్ రావు పైన విచారణ అనగానే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తర్వాత రోజు అసలు హరీష్ రావు గురించి న్యూస్ ఉండదు. అదే కేటీఆర్ విషయానికి వస్తే రోజుల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని కవిత చెప్పుకొచ్చారు.
Also Read: Rappa Rappa Video: వినాయకుడిపై రప్పా రప్పా రాతలు.. ఎరుపు రంగుతో.. గొడ్డలి గుర్తువేసి ఊరేగింపు