Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: గద్వాల జిల్లాలో దారుణం.. రిజర్వాయర్‌లో గల్లంతైన దంపతులు

Crime News: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

చేపల వేట కోసం

మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోని బావి రాముడు (40), భార్య సంధ్య (35) ఇద్దరూ తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెతికినా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే భందువులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించాయి.

Also Read: CM Revanth Reddy: వ‌ర్షాలు, వ‌ర‌ద‌ న‌ష్టాల‌పై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక అదేశాలు!

ఇప్పటివరకు దంపతుల ఆచూకీ తెలియక పోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గద్వాల్ సి.ఐ టంగుటూరి శ్రీను సంఘటన స్థలాన్ని చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దంపతులు గల్లంతవ్వడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Also Read: Damodar Rajanarsimha: నిరుద్యోగ యువతులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా వైద్య ఉద్యోగాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!