MLC Kavitha (imagecredit:swetcha)
Politics

MLC Kavitha: రసవత్తరంగా మారిన గులాబీ పార్టీ రాజకీయం..?

MLC Kavitha: రాష్ట్రంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ జాగృతి సంస్థగా మారింది. ఇప్పటివరకు రెండు కలిసి పనిచేశాయి. గులాబీ అధిష్టానం కవిత(Kavitha)ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో జాగృతి నాయకులు మండిపడ్డారు. హైదరాబాద్(Hyderabad) లోని జాగృతి కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్(Santhosh) ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. హరీష్ రావు(Harish Rao)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతీగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కవిత ప్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు.

నిరసన కార్యక్రమాలు

బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. అదే విధంగా జగిత్యాల(jagithyala), మెదక్(Medak), నిజామాబాద్, నల్లగొండ(Nalgonda), వరంగల్(Warangal) జిల్లాలోనూ బీఆర్ఎస్(BRS), జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కవిత ఫొటోతో ఉన్న ప్లెక్సీలను తొలగించారు.

Also Rad: Anjali Raghav controversy: భోజ్‌పురి నటుడు వ్యవహారంలో కీలక మలుపు.. అలా అవుతుందనుకోలేదా!

నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

పార్టీకి నష్టం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కార్పొరేషన్ల మాజీ చైర్మ‌న్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్ సాగ‌ర్ తెలిపారు. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేస్తున్న పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించేది లేద‌ని కేసీఆర్ ఎప్పుడో చెప్పార‌ని దానికి అనుగుణంగానే నేడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్నారు.

పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాద

బీఆర్ఎస్(BRS) పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మించిన పార్టీ అని.. 4 కోట్ల మంది తెలంగాణ(Telangana) ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచే 60 ల‌క్ష‌ల మంది సైనికులు క‌లిగిన పార్టీ అని తెలిపారు. కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని తీసుకున్న నిర్ణయం గొప్ప‌ద‌న్నారు. కేసీఆర్(KCR) నిర్ణయంతో పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ బాటలో పని చేస్తామని తెలిపారు. కేసీఆర్ నిర్ణయం యావత్ పార్టీకి మార్గదర్శి, అవమానాలు, ప్రభుత్వ వేధింపులను సైతం ఎదుర్కొంటూ పార్టీ కోసం శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.

Also Read: Students Bitten By Tats: గురుకుల పాఠశాలలో ఎలుకల దాడి.. భయాందోళనలో విద్యార్థులు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం