Criem News: వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ ను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 42లక్షల రూపాయల విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి(ACP Naresh Reddy) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి చెందిన గొల్లపల్లి శ్రీధర్ (26) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. అడ్డగుట్టలోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటూ ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెంది ప్రస్తుతం ఆల్విన్ కాలనీలో నివాసముంటున్న మిద్దె వీర కౌషిక్ గౌడ్ (21), కట్టా మణికంఠ (20), గుత్తుల శ్రీనివాస్ (28), షేక్ నాగూర్ వలీ (25) అతని స్నేహితులు. అందరూ చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
Also Read: Teachers Association: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి!
కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటూ..
చేస్తున్న పని నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ఈ అయిదుగురు దాని కోసం బైక్ లను అపహరించాలని పథకం వేశారు. దాని ప్రకారం వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నుంచి 22 ద్విచక్ర వాహనాలను తస్కరించారు. కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న గఫూర్ రాజా(Ghafoor Raja) అనే వ్యక్తికి చెందిన కేటీఎం 250 డ్యూక్ బైక్ ను కూడా ఇలాగే అపహరించారు. ఈ మేరకు గఫూర్ రాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, జగద్గిరిగుట్ట సీఐ కే.నర్సింహ, డీఐ నరేంద్ర రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా ముఠా సభ్యుడు గొల్లపల్లి శ్రీధర్ నెంబర్ ప్లేట్ లేని కేటీఎం బైక్ పై వస్తూ దొరికిపోయాడు. విచారణలో మిగితా నిందితుల పేర్లు వెల్లడించిన శ్రీధర్ తస్కరించిన బైక్ లను షేక్ నాగూర్ వలీ అనే వ్యక్తికి అమ్ముతున్నట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో మిగితా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Pawan Singh: స్టేజ్ మీద హీరోయిన్ నడుము గిల్లిన సింగర్.. వీడియో వైరల్