KCR( IMAGE credit: twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

KCR: బీఆర్ఎస్ లో చెత్తఏరివేసే ప్లాన్?.. పార్టీ లైన్ దాటొద్దని నేతలకు కేసీఆర్ హెచ్చరిక!

KCR: పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని నేతలకు కేసీఆర్(KCR) వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటొద్దని హెచ్చరికలు చేశారు. ఇప్పటికే పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కొందరు నేతలు బహిరంగంగానే పార్టీలోని లోపాలు, వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే అది రానురాను ఎక్కువ అవుతుందని, ఇది పార్టీ మనుగడకే కష్టమని పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.

కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలతో పాటు కమిషన్ ను నియమించడం, మళ్లీ సీబీఐకి అప్పగించడం, మరోవైపు కవిత సైతం ప్రాజెక్టు అవినీతి మరకలను పార్టీ నేతలే కేసీఆర్ కు అంటించరాని వ్యాఖ్యలు చేయడంతో పార్టీ సీరియస్ గా తీసుకుంది. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలకు సైతం బలం చేకూర్చినట్లయిందని భావించి సస్పెండ్ చేసింది. దీంతో పార్టీ నేతలకు సైతం హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టమైంది. పార్టీ నిబంధనలు దాటితే కన్న కూతురు అయినా సరే సస్పెండ్ తప్పదని కేసీఆర్ హెచ్చరించినట్లు అయింది.

Also Read: Relief to KCR Harish Rao: కేసీఆర్, హరీశ్‌కు రిలీఫ్.. హైకోర్టు ఉత్తర్వులు.. కొన్ని రోజులు సేఫ్!

బీఆర్ఎస్ లో చెత్తఏరివేసే ప్లాన్?
బీఆర్ఎస్(Brs) పార్టీలో కొనసాగుతూ ఇతర పార్టీలకు కోవర్టులుగా పనిచేస్తున్నవారిపై నిఘా పెట్టినట్లు సమాచారం. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు సమాచారం. పార్టీని విమర్శిస్తూ ఇతరపార్టీలకు ఒంతపడుతున్నవారికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీకి నష్టం చేకూర్చే ఒక్కొక్కరిని సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో నేతలను సైతం దారిలోపడతారని, పార్టీలో ఉన్నవారు సైతం కమిట్ మెంట్ తో పనిచేయనున్నారు. కవిత సస్పెండ్ తో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తారని, ఇక క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇక కవితపై నేతలు విమర్శలు స్పీడ్
ఇంతకాలం పార్టీపై, పార్టీ నేతలపై కవిత(Kavitha) విమర్శలు చేసినా పార్టీ నేతలు స్పందించలేదు. విమర్శలు చేయలేదు. కానీ పార్టీ కవితను సస్పెండ్ చేయడంతో నేతలంతా విమర్శల దాడిని పెంచారు. పార్టీ ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని చేసిన వ్యాఖ్యలను పార్టీ, నేతలు తీవ్రంగా పరిగణించారు. ఆమెపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇక కవిత ఏ ఆరోపణలు చేసినా తిప్పికొట్టేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ నేతలు సైతం స్పందించనున్నారు. ఇక పై గులాబీ వర్సెస్ కవితగా మారే అవకాశం లేకపోలేదనేది చర్చమొదలైంది.

కలిసి వస్తుందా? లేదా అనేది సర్వత్రా చర్చ
కవిత(Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీకి కలిసి వస్తుందా? అనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. స్వపక్షంలోనే విపక్షంగా మారిన కవితను పార్టీ నుంచి బయటకు పంపడంతో ఇంకా విమర్శలకు పదును పెడుతుందా? దీంతో పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందా అనేది చర్చనీయాంశమైంది. కవితను లిక్కర్ స్కాంలో ఆరోపణలు సమయంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పార్టీకి మైలేజ్ వచ్చేందని గులాబీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరంపై, నేతలపై ఆరోపణలు చేసే అవకాశం ఉండేది కాదని, ఇప్పటికైనా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సరైందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కవితతో ఏ పార్టీకి లాభం కాంగ్రెస్ కా? బీజేపీకా? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

కవిత(Kavitha) తో రాష్ట్రంలో ఏ పార్టీకి లాభం జరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ చర్చమొదలైంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ లో ఉండి విమర్శలు చేయడంతో పార్టీకి డ్యామేజ్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆమెతో కాంగ్రెస్ పార్టీకి లాభమా? లేకుంటే బీజేపీకి లాభమా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయి. ఎవరికి లబ్ది కూరుతుందనేది ప్రజల్లో చర్చజరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్యే ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ ఉండేది. బీఆర్ఎస్ పటిష్టమైన కేడర్ తో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కవిత సొంతపార్టీపై, పార్టీ నేతలపై విమర్శల వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారం జరుగుతుంది.దానిని కవిత సైతం తిప్పికొట్టింది. ఈ సమయంలోనే పార్టీ సైతం సస్పెండ్ చేయడం, గ్రామస్థాయి నుంచి జాగృతి కేడర్ ఉండటంతో కొంత బీఆర్ఎస్ కు నష్టం చేకూరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గులాబీ పార్టీ మాత్రం పార్టీకేడర్ లో గందరగోళం ఇప్పటివరకు కవిత సృష్టించారని, ఆమె సస్పెండ్ తో తెరపడిందని, పార్టీ బలోపేతం అవుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై పడుతుందా? అది బీజేపీకి గానీ, కాంగ్రెస్ కు గానీ కలిసి వస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

 Also Read:Azerbaijan on India: భారత్ మా దేశాన్ని పగబట్టింది.. అజర్‌బైజాన్ సంచలన ఆరోపణ

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?