T20 Match | పట్టపగలే చుక్కలు చూపించిన వెస్టిండీస్
T20 World Cup 2024 West Indies Won The Warm Up Match Against Australia
స్పోర్ట్స్

T20 Match: పట్టపగలే చుక్కలు చూపించిన వెస్టిండీస్

T20 World Cup 2024 West Indies Won The Warm Up Match Against Australia: టీ20 వరల్డ్ కప్ 2024‌ వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ట్రిండాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 35 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 రన్స్‌ చేసింది. నికోలస్ పూరన్ 25 బంతుల్లో 75 రన్స్ చేశాడు. అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు.

కెప్టెన్ పావెల్, రూథర్‌ఫర్డ్ దూకుడుగా ఆడారు. మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన పూరన్ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో బాళ్లపై విరుచుకుపడ్డాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడిన కారణంగా కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో చీఫ్ సెలక్టర్ జార్జి బెయిలీ, సహాయక కోచ్‌లు బ్రాడ్ హోడ్జ్, ఆండ్రీ బోర్‌వెక్ మరోసారి ఫీల్డింగ్‌కు వచ్చారు. అయితే పూరన్ క్యాచ్‌ను బోర్‌వెక్ జారవిడిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా రెండు, అగర్, టిమ్ డేవిడ్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది.

Also Read: థ్యాంక్స్‌ దేవుడా అంటూ రిషబ్ ఎమోషనల్

జోస్ ఇంగ్లిష్ టాప్ స్కోరర్. నాథన్ ఎలిస్, ఆస్టన్ అగర్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ రన్స్ చేశారు. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తమ వార్మప్ మ్యాచ్‌లను ముగించింది. కమిన్స్, మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌, కామెరూన్ గ్రీన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో పూర్తి జట్టుతో ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడలేదు. కాగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, ఒమన్, నమీబియా ఉన్నాయి. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఒమన్‌‌తో ఆడనుంది. ఇక జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఘన స్వాగతం పలకనుంది.

Just In

01

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు