Kavitha on BRS (imagecredit:twitter)
Politics

Kavitha on BRS: కవిత వ్యాఖ్యలు నిజమా?.. ఈ పరిణామాలు దేనికి సంకేతం..?

Kavitha on BRS: ఎమ్మెల్సీ కవిత సొంతపార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమేనా? అనేది హాట్ టాపిక్ అయింది. ఇన్ని రోజులు పరోక్షంగా విమర్శలు చేసిన కవిత.. అమెరికా నుంచి రాగానే మీడియా సమావేశం నిర్వహించి ఎందుకు హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావు (Santhosh Rao)లపై మాటలను తూటాల లెక్క వదలడం వెనుక ఆంతర్యమేంటనేది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చజరుగుతుంది. కేసీఆర్ పై సీబీఐ విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తుందనే ఆవేదనతో మాట్లాడారా? లేకుంటే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారా? అనేది సర్వత్రా చర్చకు దారితీసింది.

ఉన్న వాళ్ల అవినీతి మరక

గత కొంతకాలంగా పార్టీ పనితీరును ఎండగడుతూనే నేతలు అనుసరిస్తున్న విధానంపై కవిత(kavitha) మండిపడుతుంది. వరంగల్ సభ జరిగిన తీరుపై కేసీఆర్(KCR) కు గోప్యంగా రాసిన లేఖ బయటకు రావడంతో దానిపై కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనే విమర్శలు చేసింది. ఆతర్వాత కాళేశ్వరంపై వేసిన పీసీఘోష్ కమిషన్(PC Ghosh Commission) విచారణకు పిలువడంపై పార్టీతీరును, కేటీఆర్(KTR) తీరును ఎండగట్టింది.అదే సమయంలో హరీష్ రావు పై సంతోష్ పైన పరోక్షంగా విమర్శలు చేసింది. ఇప్పుడు తాజాగా కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ(CBI) విచారణకు ఇవ్వడంతో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు చేసింది. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కేసీఆర్(KCR) పక్కన ఉన్న వాళ్ల అవినీతి మరక అంటిందని, హరీష్ రావు, సంతోష్ రావు, మెగాకృష్ణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. వారి వెనుక రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఘాటు విమర్శలు చేశారు. నేను డైరెక్టుగా చెప్పినవారిపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అటు పార్టీ వర్గాలో, ఇటూ రాజకీయ వర్గాల్లోనూ చర్చజరుగుతుంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత

ఇప్పటికే హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్(Phone Tapping), కాళేశ్వరం(Kaleshwaram), పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు ఎస్టిమేట్లలోనూ ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లనుంచి కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జరిగింది. కేసీఆర్ పేరు చెప్పి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని బహిరంగ విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలతోనే హరీష్ రావును రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. దాంతో హరీష్ రావు సిద్దిపేటలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి తిరిగి కేబినెట్ లోకి తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆరోపణల నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖలు తిరిగి హరీష్ రావు కేటాయించలేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైద్యశాఖను కేటాయించారని పార్టీనేతలే అప్పుడు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: Police Officers: పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు

మెగా కృష్ణారెడ్డితో కలిసి

మాజీ ఎంపీ సంతోష్(Santhosh Rao)) రావుపైనా విమర్శలు వచ్చాయి. తనకు అనుకూలంగా ఉన్నవారిపై కేసీఆర్ దగ్గర మంచి చెప్పడం, లేకుంటే చెడుగా చెప్పారనే ప్రచారం జరిగింది. అంతేగాకుండా రాజ్యసభ ఎంపీగా కేసీఆర్ నియమించిన తర్వాత టానిక్, ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో సంతోష్ పై ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా మెగా కృష్ణారెడ్డితో కలిసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం, కేసీఆర్ పేరుతో డబ్బులు వసూల్లు చేశారనే ప్రచారం జరిగింది. కేసీఆర్ ఏదైనా సభ బాధ్యతలు అప్పగిస్తే ఆ సభకోసం కాంట్రాక్టర్ల నుంచి ఖర్చులకోసం వసూల్లు చేసేవారనే విమర్శలు వచ్చాయి. కొంతమంది నేతలను సైతం కేసీఆర్ కు సంతోష్ దూరం చేశారని పలువురు నేతలు గతంలో ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

పార్టీలోనూ తీవ్ర చర్చ

కాళేశ్వరం అవినీతి మరకను కేసీఆర్ ను అంటించడంలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని మండిపడింది. దీంతో అవినీతి జరిగినట్లు కవితనే ఒప్పుకుందని కాంగ్రెస్(Congress) విమర్శలకు ఎక్కుపెట్టింది. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాలతోపాటు అటు పార్టీలోనూ తీవ్ర చర్చజరుగుతుంది. మరోవైపు కవిత(Kavitha) వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రూపుల నుంచి కవిత పీఏ, పీఆర్వోల నెంబర్లను తొలగించడం చేశారు.

బీఆర్ఎస్ కౌంటర్

ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) పార్టీ స్పందించింది. కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అని వీడియో పోస్టు చేసింది.

Also Read: Ramesh Varma: నిర్మాతగా రవితేజ ‘ఖిలాడి’ దర్శకుడు.. ఫస్ట్ సినిమా ఏంటంటే?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ