Police Officers: పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు
పోలీస్ శాఖలో ఉత్తమ విధులను నిర్వహించిన పోలీసులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పథకాలను అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం- 2024, నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను “ఉత్తమ సేవ పతకం” పొందిన అధికారుల వివరాలు.. ఎం. అబ్దుల్ రహీమాన్ (ACP wyra) పి.సత్యనారాయణ (ఎస్సై IT Core) వున్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరో నలుగురు పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ “సేవా పతకాలు” దక్కాయి..”సేవాపతకం” పొందిన వారిలో బి.వెంకటరమణారావు (ఏఎస్సై), జె.వెంకటేశ్వర్లు (ఏఎస్సై), ఎన్.వెంకట రెడ్డి (ఏఎస్సై) ఉన్నారు.
మహోన్నత సేవ పతకం
మహోన్నత సేవా పథకం సాధించిన Sk.సయ్యద్ హుస్సేన్ (హెడ్ కానిస్టేబుల్)వున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు.
ఉత్తమ విధులు అందిస్తే ప్రజల మన్ననలు అందిస్తారు
ప్రభుత్వ శాఖల్లో అన్నిటికంటే విలువైనది పోలీస్ శాఖ మాత్రమేనని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. అలాంటి పోలీస్ శాఖలో ఉన్న అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలను అందిస్తే ప్రజలు వారికి మంచి మన్ననలు అందిస్తారు. పోలీస్ శాఖ అంటేనే ఆపదలో ఉన్న ప్రజలకు భరోసానిచ్చేదన్నారు. పోలీస్ అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిచ్చే శాఖని పేర్కొన్నారు. పోలీసులు నిత్యం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల సేవే పరమావధిగా భావిస్తూ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తుంటారు. అలాంటి సేవ తత్పరులైన వారికి అవార్డులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.