BRS Leaders Protest (imagecredit:swetcha)
హైదరాబాద్

BRS Leaders Protest: మేడ్చల్లో జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు ధర్నా..?

BRS Leaders Protest: కాళేశ్వరం ను సీబీఐ కి అప్పగించడాన్ని వ్యతికేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Malla Reddy) పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి పై బీఆర్ఎస్(BRS) నాయకులు రాస్తారోకో చేశారు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, గణపతిబప్ప మోరియా రేవంత్ రెడ్డి చోరియా, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Also Read: Nara Rohith: కాబోయే భార్యతో పబ్లిక్ లోనే రొమాన్స్ చేస్తున్న నారా రోహిత్.. ఈ ఫోటోలు చూస్తే!

ప్రజల కోసం కాలేశ్వరం

ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్(Bhaskar Yadav) మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని మరిచి రాష్ట్రం తీసుకొచ్చిన కెసిఆర్(KCR) పైన ఆరోపణలు చేయడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడం మరచి అవకతవకలు జరిగాయని ఆరోపించడం తగదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ(CBI) కు అప్పజెప్పడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డారు. కెసిఆర్ పై ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ఆణిముత్యంల బయటికి వస్తారని చెప్పారు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం బీఆర్ఎస్, కెసిఆర్(KCR)ల జపం మాని రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్, డబిల్ పూర్ సొసైటీల చైర్మన్లు రణదీప్ రెడ్డి, సురేష్ రెడ్డి, పార్టీ నాయకులు రాజ మల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, హరత్ రెడ్డి, సందీప్ గౌడ్, సంజీవ, సుదర్శన్, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Crows: కాకితో జాగ్రత్త.. పగబట్టిందో మీ పని ఔట్.. దాని జీవితాంతం మీరే శత్రువు!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ