Hanuman ( Image Source: Twitter)
Viral

Hanuman Lord: హనుమాన్ కిందకి దిగి వచ్చాడు.. ఇదిగో ప్రూఫ్.. దేవుడని మొక్కి పూజలు మొదలు పెట్టండి ఇక?

Hanuman Lord: ఇటీవలే కాలంలో భక్తి కూడా ఒక ఆట లాగా అయిపోయింది. ప్రతిదీ కించపరిచే విధంగా చేస్తున్నారు. భక్తి అంటే పూర్తిగా అర్థం తెలియని వారు కూడా దీని గురించి మాట్లాడుతుంటే వినడానికి వింతగా ఉంది. దీని వలన నిజమైన భక్తులకు కూడా విలువ లేకుండా పోతుంది. భక్తి అనే ముసుగులో చేయకూడని పనులు చేసి, దేవుడా తప్పు అయిపోయిదంటూ రెండు చేతులు మొక్కి దండం పెట్టి, యథావిథిగా వారి తప్పులు కొనసాగిస్తున్నారు. ఆ మాత్రం దానికి దేవుడు దగ్గరకు వెళ్లి, దండం పెట్టడం దేనికి? ఇంకా చెప్పాలంటే దేవుడి పేరు చెప్పుకుని కానుకలు తీసుకుని వారి స్వంత ప్రయోజనాలు కోసం వాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? భారత దేశంలో కొన్నేళ్ల నుంచి సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ, వాటిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంది భక్తి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

ఓ వ్యక్తి పెద్ద బండ రాయిని కష్ట పడకుండా ఎత్తేసాడు. చూసే వాళ్ళకి కూడా ఇది వింతగా ఉంది. అతను చాలా సులభంగా రాయిని ఎత్తడంతో నెటిజన్స్ కూడా అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది నిజమో? కాదో? అర్ధం కాకుండా ఉంది. చాలా మంది ఆంజనేయ స్వామి కిందకి దిగి వచ్చాడు. ఇంకెందుకు లేట్, అతనికి కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేయండి, ఇలాగే కదా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారుగా. ఇతనికి కూడా ఇవ్వండని మండి పడుతున్నారు.

Also Read: Kaleshwaram CBI Probe: కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడంపై బండి సంజయ్ ఏమన్నారంటే?

మొన్నటికీ మొన్న వినాయక చవితి పండుగ రోజు గణేషుడు ఒక అమ్మాయిని ఎత్తుకుని తిప్పుతున్నట్లుగా బొమ్మను తయారుచేశారు. ఇది తెలిసి చేశారో? తెలియక చేశారో ? లేక కావాలని చేశారో? చేయాలని ఇలా చేశారో కూడా అర్ధం కాకుండా ఉంది. దేవుడు పేరును  మన మనసులో తలచుకున్నప్పుడు .. మనకీ తెలియకుండానే .. మన శరీరంలో ఒక వైబ్రేషన్ వస్తుంది. అది దేవుడి గొప్పతనం. ఇంక ఏ పేరును తలచుకున్నా ఈ వైబ్ రాదు. ఒక్క దేవుడి దగ్గర మాత్రమే ఇది మనం వందకి వంద శాతం చూడగలం.

దేవుళ్ళని దేవుడి లాగా చూడటం మానేశారా? ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు విగ్రహాలు ప్రతిష్టించి, ఎవరి పూజ వాళ్లదే అన్నట్టు చేస్తున్నారు. ఒక పద్దతి లేదు? ఒక ఆచారం లేదు? ఇంత జరుగుతున్నా కూడా ఎవరూ మాట్లాడటం లేదు. అవసరం లేని చోట మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా ఏది భక్తి? దేవుళ్ళకు ఎలా పూజలు చేయాలి? పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?  అనేది తెలుసుకోండి. దేవుళ్ళను గౌరవించి, భక్తితో పూజలు చేయండి.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ