Viral Video (Image Source: twitter)
Viral

Viral Video: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ముగ్గురూ పోలీసులే!

Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చేసుకుంది. ఓ పోలీసు జంట కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భార్య తన ప్రియుడైన మరో పోలీసుతో ఇంట్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మంచి, చెడు చెప్పాల్సిన పోలీసులే ఇంతగా దిగజారి ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
కుశీనగర్ జిల్లా కస్యా పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న భార్య భర్తలు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరిది వేర్వేరు పోలీసు స్టేషన్లు కావడంతో శనివారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్లాడు. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఆమె తన ప్రియుడితో ఇంట్లో ఉండటం గమనించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన భర్త.. వారిద్దరిపై దాడి చేసి గదిలో బంధించాడు.

Also Read: Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!

లోపల నుంచి గడి పెట్టుకొని
ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. భార్య ప్రియుడు కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అతను అదే జిల్లాలోని మరొక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం మీద ముగ్గురి మధ్య ఘర్షణ, కొట్లాట జరిగిందని పేర్కొన్నారు. ఆగ్రహంతో భర్త గదికి తాళం వేసి గోల చేశాడని.. భార్య లోపల నుంచి తలుపు వేసుకుందని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: విద్యకు దైవ భూమి కేరళ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఎస్‌హెచ్ఓ ఏమన్నారంటే?
భర్త ఆరోపణల ప్రకారం.. అతడు డ్యూటీకి వెళ్లినప్పుడల్లా భార్య తన ప్రియుడిని ఇంటికి పిలుచుకునేది. ఎస్‌హెచ్‌ఓ అమిత్‌కుమార్ శర్మ మాట్లాడుతూ ‘ఇది భర్త-భార్యల గొడవ. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. మహిళా కానిస్టేబుల్‌ భర్త లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాడు. దానిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Also Read: UPI Transactions: చరిత్ర సృష్టించిన యూపీఐ.. ఆగస్టులో రికార్డ్ స్థాయి లావాదేవీలు

Just In

01

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!