Jogulamba Gadwal Accident( IMAGE crdit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal Accident: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ ను డీసీఎం వ్యాన్ ఢీ?

Jogulamba Gadwal Accident:  జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం SNS ఫ్యాక్టరీ ఎదురుగా జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనం కోసం వెళుతున్న ట్రాక్టర్ ను డీసీఎం వ్యాన్ ఢీకొనగా ఇద్దరు మృతి చెందగా,మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.వినాయక నిమజ్జనం విషాదాంతంగా మారిన ఘటన తెల్లవారుజామున జరిగింది. వివరాలలోకి వెళితే ఇటిక్యాల మండల కేంద్రంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం నిమజ్జనం కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు.

 Also Read: Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!

డీసీఎం ట్రాక్టర్ ను ఢీ

గ్రామంలో నృత్యాలు, భజనలతో ట్రాక్టర్ పై వినాయకుడిని ఊరేగించారు.అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాక్టర్ లో బీచుపల్లి కృష్ణా నదిలో నిమజ్జనం కోసం తరలిస్తుండగా..కర్నూల్ వైపు నుండి హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ పై ఉన్న పదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా జములన్న, నరసింహులు, ఇద్దరు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో కర్నూల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇటిక్యాల ఎస్సై రవి తెలిపారు.

Also Read: Kaleshwaram project: లక్షకోట్ల ప్రాజెక్టు నాలుగేళ్లలో కుప్పకూలింది.. ఆ పాపం ముమ్మాటికి కేసీఆర్ దే!

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్