Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా!
Viral Video (Image Source: Twitter)
Viral News

Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!

Viral Video: సాధారణంగా పిల్లలు ఒక చోట కుదురుగా ఉండరు. అందుకే తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్లినా ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 20 అడుగుల ఎత్తున్న ట్రాక్ పై ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ పిల్లాడు నడుస్తూ ఒక్కసారిగా అందరినీ భయందోళనకు గురిచేశాడు. వీడియో చూస్తున్న వారు సైతం బాలుడికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే…
అమెరికా (USA) పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని హెర్షీపార్క్ (Hersheypark) లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి ఎలాంటి సేఫ్టీ హార్నెస్ (Safety Harness) లేకుండా ఎత్తైన అమ్యూజ్‌మెంట్ రైడ్ ట్రాక్‌పై ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. ఇది గమనించిన సందర్శకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తులో ఉన్న సన్నని ట్రాక్ పై నుంచి బాలుడు కింద పడితే పరిస్థితి ఏంటన్న టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఎత్తైన ట్రాక్‌పైకి ఎలా వెళ్లాడు?
వీడియోను చూసిన వారంతా అంత ఎత్తులో ఉన్న ట్రాక్ పైకి బాలుడు ఎలా వెళ్లాడన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెర్షీ ఎంటర్‌టైన్‌మెంట్ & రిసార్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆ చిన్నారి తన తల్లిదండ్రుల నుండి తప్పిపోయాడు. అనుకోకుండా మోనోరైల్ ఉన్న ప్రదేశంలోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రైడ్ పనిచేయడం లేదు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని రిసార్ట్స్ సిబ్బంది తెలిపారు.

Also Read: CM Revanth Reddy: విద్యకు దైవ భూమి కేరళ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

పార్క్ సిబ్బంది ఏమన్నారంటే
అయితే బిడ్డ కనిపించకుండా పోయిన విషయాన్ని హెర్షీపార్క్ సిబ్బంది దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. దీంతో వారంతా అప్పటికే బిడ్డ ఆచూకి కోసం వెతకడం ప్రారంభించారు. ‘మా సిబ్బంది చిన్నారిని వెతుకుతుండగానే అతను మోనోరైల్ భద్రతా ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ రైడ్ మూసివేయబడి చైన్ వేసి బిగించబడి ఉంది. ప్లాట్‌ఫామ్ వద్ద అడ్డంకులు కూడా పెట్టబడ్డాయి’ అని పార్క్ కు సంబంధించిన ఒక ప్రతినిధి తెలిపారు.

Also Read: UPI Transactions: చరిత్ర సృష్టించిన యూపీఐ.. ఆగస్టులో రికార్డ్ స్థాయి లావాదేవీలు

ధైర్య సాహసాలు ప్రదర్శించి..
అయితే బాలుడు ట్రాక్ పై ప్రమాదకరంగా నడవడాన్ని గమనించిన ఓ వ్యక్తి అప్రమత్తమయ్యాడు. ట్రాక్ కు ఆనుకొని ఉన్న షాపు మీదకు ఎక్కాడు. దాని ద్వారా ట్రాక్ మీదకు చేరుకొని బాబును రక్షించాడు. దీంతో కింద ఉన్న సందర్శకులంతా చప్పట్లు కొడుతూ అతడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వ్యక్తి బిడ్డతో పాటు కింద చేరుకోగానే స్థానికులు అతడ్ని ప్రశంసించారు. చిన్నారిని పెను ముప్పు నుంచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అటు ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్‌కు.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..