Crows (Image Source: Freepic)
Viral

Crows: కాకితో జాగ్రత్త.. పగబట్టిందో మీ పని ఔట్.. దాని జీవితాంతం మీరే శత్రువు!

Crows: మనకు నిత్యం ఎదురుపడే పక్షుల్లో కాకులు ముందు వరుసలో ఉంటాయి. కాకులు సాధారణంగా ఇంటిపైన వాలి.. ఎండబెట్టిన వడియాలు, కొబ్బరి ముక్కలను ఎత్తుకెళ్తుంటాయి. దీంతో చాలా మంది వాటిని దురుసుగా, కోపంతో తరిమేస్తుంటారు. అయితే ఇది చాలా మందికి పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వారు చేసిన పరిశోధన గురించి విన్న తర్వాత మీ ఆలోచన మారిపోతుంది. తనతో కోపంగా ప్రవర్తించిన వారిపై కాకి పగ పెంచుకుంటుందని ఈ అధ్యయనం తేలింది. 20 ఏళ్ల పాటు మిమ్మల్ని శత్రువుగా చూస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

కాకులపై సుదీర్ఘ అధ్యయనం
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం  (University of Washington) పరిశోధకుల ప్రకారం కాకి.. పగపట్టే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. తనపై కోపం చూపించిన వారిపై ప్రతీసారి దాడికి ప్రయత్నించడం, గట్టిగా కేకలు వేయడం, మీదకు దూసుకొచ్చి బెదిరించడం, తోటి వాటిని సైతం శత్రువులుగా మార్చడం వంటి లక్షణాలు కాకిలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. 2000వ దశకంలోనే వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు దీర్ఘకాలిక అధ్యయనం ప్రారంభించారు.

కాకులను ఇబ్బంది పెట్టి..
2005లో వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ జాన్ ఎం. మార్జ్లఫ్ (Dr John M. Marzluff) నాయకత్వంలో ఒక ప్రయోగం మొదలైంది. కాకులు తమను కష్టపెట్టిన మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవా? అయితే ఎంతకాలం? అన్న ఉద్దేశ్యంతో ఈ పరిశోధనను ప్రారంభించారు. ప్రయోగంలో భాగంగా కొందరు పరిశోధకులు కొన్ని కాకులను పట్టుకుని వాటికి గుర్తులు (బాండింగ్) పెట్టారు. ఆ సమయంలో కొందరు ప్రత్యేకమైన రబ్బరు కేవ్‌మ్యాన్ మాస్క్ ధరించి వాటిని ఇబ్బంది పెట్టారు. అలా చేయడం ద్వారా మాస్క్ ధరించే వ్యక్తులతో వాటికి ముప్పు ఉందన్న సంకేతాన్ని పంపారు. ఇంకొక బృందం సాధారణ మాస్క్‌లు ధరించి కాకులను అసౌకర్యపరచలేదు. అనంతరం పట్టుకున్న కాకులను వారు విడిచిపెట్టారు.

దారుణమైన రియాక్షన్..
కాకులను విడిచిపెట్టిన కొద్దిసేపటి తర్వాత కేవ్‌మ్యాన్ మాస్క్ లతో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చారు. కాకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని చూశాక కాకులు దారుణంగా ప్రవర్తించడం ప్రారంభించాయి. మాస్క్ ధరించిన వారివైపు కోపంగా చూస్తూ గట్టిగా కేకలు వేయడం, ఆకాశం నుండి వారి వైపు దూసుకెళ్లడం, వారి చుట్టూ తిరుగుతూ దాడి చేయడం మొదలుపెట్టాయి. కొందరిని చాలా దూరం వరకూ పరిగెత్తించడాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. అయితే సాధారణ మాస్కులు ధరించిన వారిని మాత్రం కాకులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని పరిశోధకులు తెలిపారు.

17 ఏళ్ల పాటు..
కొద్దిరోజుల తర్వాత ఆ కుకల గుంపులో కొత్తగా మరికొన్ని వచ్చి చేరినట్లు వాషింగ్టన్ యూనివర్శిటి శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని బట్టి కాకులు తమ జ్ఞానాన్ని, పగను మిగతా కాకులకు పంచుతాయని పరిశోధకులు తేల్చారు. ఈ ప్రయోగంలో అద్భుతమైన అంశం ఏమిటంటే కాకుల ప్రతీకార దాడి దాదాపు 17 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ కాలం అంతా కాకులు ఆ శత్రుత్వాన్ని మరచిపోలేదు.

కుటుంబ బంధాలకు ప్రాధాన్యం
కాకుల మధ్య సంభాషణ కేవలం ప్రమాదంపై మాత్రమే కాదు. ఆహారం వనరుల గురించి కూడా వేర్వేరు శబ్దాలతో మాట్లాడుకుంటాయి. అవి చుట్టపక్కల వాతావరణాన్ని చాలా నిశితంగా గమనించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకదానిని మరొకటి అనుకరించే తత్వాన్ని కూడా కలిగి ఉంటాయి. కుటుంబ బంధాలకు అవి ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే ఒక కాకి చనిపోయినప్పుడు మిగిలిన కాకులు అక్కడికి చేరుకొని గుంపుగా అరుస్తుంటాయి. అది ఒక రకంగా వాటి ఆవేదనను వ్యక్తం చేయడమే.

Also Read: Allu Arjun: బాధను దిగమింగుకుని.. అల్లు అర్జున్ చేసిన పనికి సలాం కొడుతున్న ఫ్యాన్స్

ఇలాంటి ప్రవర్తన ఇతర పక్షుల్లోనూ ఉందా?
కాకులు మాత్రమే కాదు, మరికొన్ని పక్షులు కూడా ప్రమాదకర వ్యక్తులపై ఇలాంటి దాడి ధోరణులు ప్రదర్శిస్తాయి. వీటిలో ఆస్ట్రేలియన్ మాగ్‌, నార్తర్న్ మాకింగ్‌బర్డ్, కెనడా గీసులు, సముద్ర గల్లులు, రెడ్-వింగ్ బ్లాక్‌బర్డ్‌లు, జేస్ ఉన్నాయి. పక్షులు అనుసరించే ఈ ప్రతీకార దాడి వ్యూహాన్ని ‘మాబ్బింగ్’ అంటారు. ఒక గుంపు మొత్తం కలిసి కేకలు వేయడం, దూసుకురావడం, రెక్కలతో బెదిరించడం ద్వారా శత్రువును భయపెట్టడం చేస్తాయి. తద్వారా తమపై తిరిగి దాడి చేయకుండా అడ్డుకోవాలని అవి ప్రయత్నిస్తాయి. అయితే, దీర్ఘకాలం పగ పట్టే ప్రవర్తన మాత్రం చాలా కొద్ది పక్షుల్లో మాత్రమే ఉంది. అది కూడా గూళ్లు కట్టి సంతానం చూసుకునే పెద్ద పక్షుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: PM Modi – SCO Summit: చైనా టూర్ సూపర్ సక్సెస్.. భారత్‌తో చేతులు కలిపిన రష్యా, డ్రాగన్.. ఇక పాక్, యూఎస్ పని ఔట్!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం