Allu Arjun: రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన విషాద ఘటన మెగా, అల్లు కుంటుంబాలను సోక సంద్రంలో ముంచింది. అయితే అల్లు అర్జున్ విషాద సంఘటనతో కుటుంబంలో ఉన్న బాధను దిగమింగుకొని #AA22A6 సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. దీంతో అల్లు అర్జున్ కు వృత్తిపట్ల ఉన్న నిబద్ధత ఏమిటో మరో సారి రుజువైందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వార్తను ప్రొడ్యూసర్ ఎస్ కే ఎస్ పోస్ట్ చేశారు. దీనిని చూసిన కొందరు అభిమానులు అల్లు అర్జున్ చేసిన పని కరెక్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ కూడా షూట్ ఆపుకునే వచ్చాడు కదా అప్పుడు ఎందుకు పోస్ట్ పెట్టలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సైన్స్-ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ తరహాలో రూపొందుతోంది. దర్శకుడు అట్లీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చి దిద్దుతున్నారు. ఈ చిత్రం అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ 6వ చిత్రంగా గుర్తించబడుతుంది. అందుకే దీనిని #AA22xA6గా పిలుస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా ఈ సినిమా నిలవనుంది.
Read also-Kaleshwaram project: లక్షకోట్ల ప్రాజెక్టు నాలుగేళ్లలో కుప్పకూలింది.. ఆ పాపం ముమ్మాటికి కేసీఆర్ దే!
అల్లు అర్జున్ నాయనమ్మ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి మరియు పద్మశ్రీ అల్లు రామలింగయ్య భార్య అయిన అల్లు కనకరత్నమ్మ (94) ఆగస్టు 30, 2025న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆగస్టు 30 అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సంఘటన అల్లు కుటుంబాన్ని, మెగా కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే, అల్లు అర్జున్ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకున్నారు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె పార్థీవ దేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తరలించారు. అదే రోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆమెకు అత్తమ్మ అయిన వారు, అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించి, పాడె మోసి తన అత్తమ్మకు తుది వీడ్కోలు పలికారు.
.@alluarjun gari dedication and commitment towards profession is truly admiring & inspiring
రెండు రోజుల క్రితం ఇంట్లో జరిగిన విషాదాన్ని దిగమింగుకొని తన వల్ల సెట్స్ మీద ఉన్న #AA22 కు ఎటువంటి అంతరాయం కలుగకూడదు అని వెంటనే షూటింగ్ కి హాజరు కావటం అయన నిబద్దత కి నిదర్శనం pic.twitter.com/t18H2vZ9T1— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 1, 2025