Mahabubabad Heavy Rains: మహబూబాబాద్ జిల్లాలో యావరేజ్ వర్షపాతం నమోదయింది. వివిధ మండలాల్లో కురిసిన వర్షపాత వివరాలు. కొత్తగూడ 57.8, గంగారం 72.6, బయ్యారం 99.8, గార్ల 47.8, డోర్నకల్ 78.0, కురవి 20.2, మహబూబాబాద్ 56.2, గూడూరు 78.6, కేసముద్రం 24.0, నెల్లికుదురు 28.0, నరసింహలపేట 32.0, చిన్నగూడూరు 14.2, మరిపెడ 18.6, దంతాలపల్లి 5.2, తొర్రూరు 28.4, పెద్ద వంగర 26.8 వర్షపాతం నమోదయింది.
పాకాల వాగు బ్రిడ్జి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్
పాకాల వాగు బ్రిడ్జి పై నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు నుండి కేసముద్రం, గూడూరు నుండి నెక్కొండకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పాకాల వాగు గూడూరు బ్రిడ్జి పై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేసినట్లు రెవెన్యూ, పోలీస్ అధికారులు వెల్లడించారు.
Also Read: GAMA Awards 2025: ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’
ప్రయాణికులు గమనించి వేరే మార్గం ద్వారా వెళ్లాల్సిందిగా సూచించారు. ఉదృతంగా రహదారులపై ప్రవహిస్తున్న వరద నీటిలో ప్రయాణాలు సాగించి ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు. సోమవారం సైతం భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణ విషయంలో నిర్ణయం తీసుకోవద్దని వివరించారు. వర్షాల దాటికి రహదారులపై వరద ఉధృతి, వాగులు చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లొద్దని, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలను సైతం మానుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
తురలు వేసిన మారని పరిస్థితి
రాత్రి కురిసిన భారీ వర్షానికి దమ్మపేట పట్టణ కేంద్రంలో పలు కాలనీలో వరద నీళ్లు రోడ్లపై ప్రవహించింది. గాయత్రీ నగర్ ఎదురుగా ప్రధాన రహదారిపైకి భారీగా నీరు చేరడంతో రహదారి నీట మునిగింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాయత్రి నగర్ పై నుండి వస్తున్న వరద ప్రవాహం చెరువులో కలిసేందుకు సరైన కాలువ మార్గం లేకపోవడంతో ప్రతి ఏడాది రహదారిపైకి వరద నీరు చేరుకుంటుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇటీవలనే వరద నీరు రోడ్డు దాటేందుకు అధికారులు తూరాలు ఏర్పాటు చేసినప్పటికీ వరదనీరు ప్రవహించే కాలువ మార్గం సరిగా లేనందున ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
Also Read: Street Food: రోడ్లపై పునుగులు, బోండాలు తినేవాళ్ళు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!