Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: గంజాయి దందా చేస్తూ పట్టుబడ్డ సెక్యూరిటీ గార్డు.. ఎక్కడంటే..?

Crime News: గంజాయి దందా చేస్తున్న సెక్యూరిటీ గార్డు(Security guard)ను ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 7.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్(Bihar)​ రాష్ట్రానికి చెందిన అర్జున్​ కుమార్(Arjun Kumar) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. అమృత్ కపాడియా నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. బీహార్​ నుంచే ఇక్కడకు వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాహుల్ పండరితో కొన్ని రోజుల క్రితం అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గంజాయి తెస్తూ తెలిసిన వారికి అమ్ముతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్​ ఫోర్స్ సీఐ నాగరాజు(CI Ngaraju) సిబ్బందితో కలిసి అర్జున్​ కుమార్​ ఇంటిపై దాడి చేసి గంజాయిని సీజ్​ చేశారు. పరారీలో ఉన్న రాహుల్ పండరి(Rahul Pandari) కోసం గాలిస్తున్నారు.

ధూల్​ పేటలో..

ఎక్సయిజ్ స్టేట్ టాస్క్​ ఫోర్స్​ ఏ టీం పోలీసులు ధూల్ పేటలో వ్యక్తిని అరెస్ట్ చేసి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ట్రాన్స్​ పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి జియాగూడ రోడ్డులో తనిఖీలు చేపట్టారు. రాధాకృష్ణ గోశాల వద్ద ధన్​ రాజ్​ సింగ్​ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. ఈ దందాతో జామ్ వాలా అనిల్ సింగ్ కు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో అతనిపై కూడా కేసులు నమోదు చేశారు.

Also Read: Min Komati Reddy: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. అలా చేయమంటున్న మంత్రి..?

తుని నుంచి గంజాయి తెస్తూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుంచి గంజాయి తెస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్న ముగ్గురిని ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.109 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్​బీ కాలనీలోని ఓ హాస్టల్​ లో ఉంటున్న వరుణ్​ కుమార్​ అనే యువకుడు కొన్ని రోజులుగా తుని నుంచి గంజాయి తీసుకు వస్తూ సాయి మణికంఠ, బన్నీల ద్వారా పీజీ హాస్టల్​ పరిసర ప్రాంతాల్లో అమ్మిపిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందగా సీఐ సుభాష్​ చందర్​, ఎస్​ఐలు అఖిల్​, వెంకట్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయితోపాటు రెండు స్కూటీలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Telangana Assembly: కేసీఆర్ అసెంబ్లీ వస్తారా?.. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం