New Ration Cards (imagecredit:twitter)
తెలంగాణ

New Ration Cards: తెలంగాణలో ప్ర‌తి కుటుంబానికి ఏటా రూ 18వేలు ఆదా..?

New Ration Cards: కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీతో పేద ఫ్యామిలీల్లో ఆర్ధిక భరోసా లభిస్తున్నది. పీడీఎస్‌(PDS) దుకాణాల ద్వారా ప్ర‌తి కుటుంబం ఏటా స‌న్న‌బియ్యం కోసం ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బులు ఆదా అవుతున్నాయి. స‌రాస‌రి ఇంటికి ఐదుగురు స‌భ్యులు చొప్పునా ప్ర‌తి కుటుంబానికి నెలకు 30 కేజీల సన్న‌బియ్యం అందుతోంది. ఈ లెక్క‌న‌ ప్ర‌తి కుటుంబానికి నెల‌కు రూ.1,500 వ‌ర‌కు ఆదా అవుతుంది. అంటే నెలకు రూ.18 వేలు ఆదా అవుతున్నట్లు ఆఫీసర్లు ప్రభుత్వానికి ఓ ప్రత్యేక రిపోర్టు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 99.97 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఏటా రూ.18 వేలు చొప్పునా ఆదా కానుండగా, మొత్తంగా తెలంగాణ ప్ర‌జ‌లు ఏటా స‌న్న‌బియ్యంపై ఖ‌ర్చు చేస్తున్న రూ.17,994 కోట్లు ఆదాకానున్నాయి. వీటితో పాటు కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ ద్వారా ల‌బ్ధిదారులు గృహ‌జ్యోతి, స‌బ్సిడీ గ్యాస్ సిలిండ్‌, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ‌ ప‌థ‌కాల‌కు అర్హ‌త పొందిన‌ట్టైంది. కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాలను చేరువ చేస్తోంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఇక సన్నబియ్యం పంపిణీ స్కీమ్ మెరుగ్గా ఉన్నదని, అన్ని పీడీఎస్ దుకాణాల్లో అద్భుతంగా రైస్ పంపిణీ జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పొందుపరిచారు.

సెప్టెంబరు నుంచి కొత్త కార్డు దారులకు..?

ప్ర‌జాపాల‌న‌లో కొత్త రేష‌న్ కార్డు(New ration cards)దారుల‌కు సెప్టెంబ‌ర్ నుంచి రేష‌న్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో ఏళ్ల తరబడి ప్ర‌జ‌ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డనున్నది. కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వం అర్హులైన కుటుంబాల‌కు దాదాపుగా 10 ల‌క్ష‌ల కొత్త రేష‌న్‌కార్డుల‌ను మంజూరు చేసింది. కార్డు లేని అర్హుల‌కు కొత్త కార్డుతోపాటు, పాత కార్డుల్లో కొత్త స‌భ్యుల చేర్పుతో సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అద‌నంగా 40 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారులు స‌న్న‌బియ్యం అందుకోనున్నారు. దీంతో మొత్తంగా 99.97 ల‌క్ష‌ల కుటుంబాలు స‌న్న‌బియ్యం అందుకోనున్నాయి. త‌ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.21 కోట్ల మంది ల‌బ్ధిపొంద‌నున్నట్లు ఆఫీసర్ల నివేదిక లో వెల్లడించారు. అయితే రేషన్ పంపిణీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉన్నదని కొందరు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కూడా కోరారు.

Also Read: Water Board: మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ప్రతిపాదనలు సిద్ధం!

మార్చిలో షురూ..

రాష్ట్రంలోని పేద‌లు ఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌న్న ల‌క్ష్యంతో రేష‌న్ దుకాణాల ద్వారా స‌న్న‌బియ్యం పంపిణీకి కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.అర్హత ఉన్న ప‌త్రి ల‌బ్ధిదారుడికి 6 కేజీల స‌న్న‌బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది మార్చి చివ‌ర్లో ఘ‌నంగా ప్రారంభించింది. కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌ ఎత్తున స్పంద‌న లభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు ఉచితంగా స‌న్న‌బియ్యం పంపిణీపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.గ‌తంలో 89.95 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మాత్ర‌మే రేష‌న్ కార్డులు ఉండేవి. గ‌త 11 ఏళ్ల‌లో కొత్త రేష‌న్ కార్డులు జారీ అవ్వ‌క‌పోవ‌డంతో ల‌బ్ధిదారుల సంఖ్య‌ 2.81 కోట్లకు ప‌రిమిత‌మైంది. అయితే, కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జాపాల‌న ప్రారంభ‌మ‌య్యాక అర్హులైన ప్ర‌తిఒక్క‌రికి రేష‌న్ కార్డును అందించాల‌న్న ల‌క్ష్యంగా, రేష‌న్ కార్డు పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా భావించి కొత్త‌ కార్డుల‌ పంపిణీకి గ‌త జ‌న‌వ‌రిలో శ్రీకారం చుట్టింది.జూలైలో హుజుర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేష‌న్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఆగ‌స్టు చివ‌రి క‌

లోకల్ బాడీలో లాభం…?

ఇక సన్న బియ్యం పంపిణీ లోకల్ బాడీ ఎన్నికల్లో కీ రోల్ పోషించనున్నదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రామ‌గ్రామాన ఇది త‌మ‌కు లాభం చేకూరుస్తుంద‌ని అధికార పార్టీ భావిస్తోంది. ఇది గ్రామ పంచాయ‌తీ మొద‌లుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక‌ల్లో త‌మ‌ అభ్య‌ర్థులు, తాము బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాల‌ను మెరుగుప‌రుస్తుంద‌ని కాంగ్రెస్ ధీమాగా ఉన్నది. ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలపై కూడా గ్రౌండ్ లెవల్ లో భారీ స్థాయిలో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పీఏసీ సమావేశంలో సూచించారు. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, పార్టీ క్షేత్రస్థాయి వింగ్ లతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. పార్టీ, ప్రభుత్వం ..రెండూ సమన్వయమై ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ ప్రచారం పేరిట తీసుకొని పూర్తి చేయాలని ముఖ్య నేతలు , అన్ని జిల్లాలకు సూచించారు.

Also Read: Indian Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు డైవర్షన్, మరికొన్ని రద్దు.. ట్రైన్స్ లిస్ట్ ఇదే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం