Trump porn star case
అంతర్జాతీయం

USA:శృంగార తార కేసులో ట్రంప్‌ దోషి

A New York jury convicted Trump on n his hush money case:
శృంగార తారకు అక్రమ చెల్లింపులు (హుష్ మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు దోషిగా పేర్కొంది. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డులకెక్కాడు. పైగా అక్రమ సంబంధం గురిచి పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు ట్రంప్ చేసిన చెల్లింపుల విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన నేరంలో ట్రంప్ నేరం రుజువయ్యింది. ఈ కేసుకు సంబంధించి ట్రంప్ పై మోపిన 34 అభియోగాలు రుజువైనట్లు 14 మంది సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. కాగా జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్‌ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ హుష్‌మనీ కేసు ఫైల్‌ చేసింది.

శిక్ష పడ్డా ప్రచారం

ఈ ఏడాది నవంబర్‌ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్‌ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్‌5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్‌ చేసే రిపబ్లికన్‌ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం.

నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్‌

ఇది అవమానకరమంటూ తీర్పును ట్రంప్‌ కొట్టిపారేశారు. ఇది అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపించారు. నిజమైన తీర్పు నవంబర్‌ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని వ్యాఖ్యానించారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. మరోవైపు బైడెన్‌-హారిస్‌ ప్రచార బృందం ఈ తీర్పును స్వాగతించింది. ఎవరూ చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి నిరూపితమైందని పేర్కొంది. ట్రంప్‌ తనకు చట్టాలేమీ వర్తించవనే ధోరణిలో వ్యవహరించేవారని ఆరోపించింది. అవన్నీ అపోహలేననే విషయం ఈ తీర్పుతో స్పష్టమైందని వ్యాఖ్యానించింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు