Railway Recruitment: రైల్వే రంగంలో జాబ్ చేయాలనుకునే వారికీ ఇదే గొప్ప అవకాశం. మీ కెరీర్ ను మరింత ఆకర్షణీయంగా రూపొందించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సెంట్రల్ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ముంబయి, తాజాగా ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,418 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది . 2025 సెప్టెంబర్ 11వ తేదీతో ముగియనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైల్వే రంగంలో మీ కెరీర్‌ను పూర్తిగా మార్చుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్క తెలుసుకోండి. ట్రేడుల వివరాలు ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ట్రేడులలో అప్రెంటిస్‌లను ఎంపిక చేయనున్నారు. ఈ ట్రేడులలో కొన్ని ముఖ్యమైన విభాగాలలో తీసుకోనున్నారు.
పోస్టులు
వెల్డర్: వెల్డింగ్ పనులకు సంబంధించిన నైపుణ్యాలు.
ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రికల్ సిస్టమ్స్, రిపేర్‌లలో నైపుణ్యం.
మెషినిస్ట్: యంత్రాల తయారీ, నిర్వహణ.
కార్పెంటర్: కలప పనులు, నిర్మాణాలు.
ఫిట్టర్: యాంత్రిక భాగాల సమీకరణ , రిపేర్.
షీట్ మెటల్ వర్కర్: లోహ షీట్లతో పని చేయడం.
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆధారిత పనులు.
మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్: యంత్ర సాధనాల నిర్వహణ.
పెయింటర్: పెయింటింగ్, ఫినిషింగ్ పనులు.
మెకానిక్: యాంత్రిక వ్యవస్థల నిర్వహణ.
Also Read: Amitabh Bachchan: మరోసారి బాలయ్యకు హ్యాండిచ్చిన అమితాబ్.. ఫంక్షన్‌కు పిలిస్తే రాకుండా ఏం చేశారంటే?
విద్యార్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీస విద్యార్హతలను కలిగి ఉండాలి.
10వ తరగతి: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఐటీఐ సర్టిఫికేట్: సంబంధిత ట్రేడులో గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ ఐటీఐ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకునే ట్రేడుకు సంబంధించినదిగా ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయసు 2025 ఆగస్టు 12 నాటికి కనీసం 15 సంవత్సరాలు. గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు (SC/ST/OBC/PwD) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు.
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు.
PwD అభ్యర్థులకు: 10 సంవత్సరాల సడలింపు.
Also Read: OG Film: పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటే? భలే ఆఫర్ పట్టేసిందిగా!
వేతనం
ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలంలో నెలకు రూ.7,000/- స్టైపెండ్ చెల్లించబడుతుంది. ఈ స్టైపెండ్ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
దరఖాస్తు రుసుము
ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు రూ.100/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. రుసుము చెల్లింపు ఆన్‌లైన్ విధానంలో (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ) చేయవచ్చు. SC/ST/PwD/మహిళా అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంటుంది.