Pawan Kalyan OG
ఎంటర్‌టైన్మెంట్

OG Film: పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటే? భలే ఆఫర్ పట్టేసిందిగా!

OG Film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూస్తున్న సినిమా ‘ఓజీ’. ‘ఆర్ఆర్ఆర్’ బ్యానర్ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషన్ కంటెంట్.. సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్.. ఫ్యాన్స్‌కు కాదు, ప్రేక్షకులందరికీ ఎంతగానో నచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడొక వార్త బాగా వైరల్ అవుతోంది.

Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!

ఇటీవల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటూ పలువురు హీరోయిన్ల పేరు వినబడిన విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్న నటే.. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆ విషయాన్ని రివీల్ చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. డీజే టిల్లు ఫేమ్ రాధిక అలియాస్ నేహాశెట్టి. తాజాగా ఈ భామ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు హాజరైంది. అక్కడ ఓజీలో చేసినట్లుగా ప్రకటించింది. అంతే, ఇక ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసిందంటూ ప్రచారం మొదలైంది. ఆమె మాత్రం స్పెషల్ సాంగ్ అని రివీల్ చేయలేదు. కానీ అందరూ ఆమె చేసింది స్పెషల్ సాంగే అని ఫిక్సవుతున్నారు. నిజంగా ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కానీ, లేదా నటించిగానీ ఉంటే.. ఆమెకు మంచి అవకాశం వచ్చినట్లే భావించవచ్చు. మరి ఆమె ‘ఓజీ’లో ఏం చేసిందనేది సెప్టెంబర్ 25న తెలిసిపోతుంది.

Also Read- Sniffer Dog Retires: పోలీసు జాగిలం రిటైర్మెంట్.. ఎన్ని కేసుల్లో నిందితులను పట్టించిందంటే?

ప్రస్తుతం ఓజీ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్‌ జరిగినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు వచ్చిన ‘హరి హర వీరమల్లు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలబడలేకపోయింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నెక్ట్స్ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే సినిమాగా అంతా చెప్పుకుంటున్నారు. మొదటి రోజే ఈ సినిమా భారీ రికార్డ్ క్రియేట్ చేయబోతుందనేలా కూడా టాక్ నడుస్తుంది. ఎస్. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది