Youtuber Arrest (Image Source: Twitter)
Viral

Youtuber Arrested: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి ఏమో.. అడ్డంగా బుక్కైన యూట్యూబర్

Youtuber Arrested: అతిగా నీతులు చెప్పేవారు రియాలిటీలో దానిని పాటించరని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే దానిని ఓ వ్యక్తి నిజం చేస్తూ కటకటాల్లోకి వెళ్లాడు. ఒడిశాకు చెందిన ఒక యూట్యూబ్ మోటివేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ దూరంగా ఉండమని చెప్పే అతనే.. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?
ఆగస్టు 14న ఓ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి యూట్యూబ్ లో మోటివేషనల్ లెక్చర్లు ఇచ్చే వ్యక్తిని భువనేశ్వర్ పోలీసుల అరెస్ట్ చేశారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను భువనేశ్వర్ – కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ (Suresh Dev Dutta Singh) వెల్లడించారు. కటక్‌కు చెందిన మనోజ్ సింగ్‌ను భువనేశ్వర్‌లోని ఒక ఇంటిలో దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. అతను దాదాపు 200 గ్రాముల బంగారం, రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు, ఒక మోటార్ ‌బైక్ దొంగిలించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!

పగలు నీతులు.. రాత్రి ఐతే
పోలీసుల ప్రకారం.. మనోజ్ సింగ్‌కు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆయన నిజాయితీగా జీవించడం గురించి మోటివేషనల్ ప్రసంగాలు చేసేవారు. ‘ఒకరు ఎలా నేరస్తుడిగా మారతారు’ అనే థీమ్ తో సురేష్ ఓ వీడియో సైతం చేశాడు. అందులో నేరాలను ఎలా నియంత్రించాలో కూడా చెప్పారు. అలా యూట్యూబ్ లో నీతులు చెప్పే మనోజ్ సింగ్ రియాలిటీలో దొంగతనం చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు కారణమైంది. అతడు పగలు మోటివేషన్ స్పీకర్ కట్టింగ్ ఇచ్చి.. రాత్రివేళల్లో దొంగతనాలు చేసేవాడని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాదు భువనేశ్వర్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో 10 పైగా క్రిమినల్ కేసులు అతడిపై ఉన్నట్లు వివరించారు.

Also Read: Indore Woman: ప్రియుడితో లేచిపోయి.. మరొకరిని పెళ్లాడి.. ఫైనల్‌గా ఇంటికొచ్చేసిన యువతి

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం