Viral News: కట్టుకున్న భార్య.. ఉంచుకున్న లవర్ ఒకేసారి పోయే?
Viral News (image credit:Pixeles)
Viral News

Viral News: ఆన్లైన్ పేమెంట్ తో భర్త గుట్టు మొత్తం బయటకు.. ఉన్న పెళ్లాం పోయే, ఉంచుకున్న సెటప్ పోయే?

Viral News: తప్పులు చేయడం చాలా ఈజీనే. కానీ, తప్పించుకుని తిరగడం చాలా కష్టం. ఎందుకంటే, తప్పులు చేసేటప్పుడు ఒక చిన్న క్లూ తెలిసినా దొరికిపోవడం పక్కా. కొన్ని సందర్భాల్లో అయితే నేరం చేసి ఏం తెలియనట్టు ఉన్న నేరస్థులను కూడా పోలీసులకు పట్టిస్తుంది. ఇలాంటివి రోజూ మనం చూస్తూనే ఉంటున్నాం. అయితే, తాజాగా ఓ భర్త తన భార్యకి తెలియకుండా కొన్నేళ్ల పాటు నడిపిన వ్యవహారం ఒక్క చిన్న పొరపాటు వలన బయటపడింది. దీంతో, అబ్బాయి గారు ఒంటరిగా మిగిలారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోయాయి. ఉన్నది పెళ్లాం పోయే, ఉంచుకున్న సెకండ్ సెటప్ కూడా పోయే? అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం..

చైనాలోని యాంగ్జియాంగ్ నగరంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి చెప్పుకుందాం. ఓ వ్యక్తి, తన భార్యకు తెలియకుండా, రహస్యంగా వేరే మహిళతో అక్రమ సంబంధం నడిపాడు. ఈ వ్యవహారం సంవత్సరాల తరబడి బాగానే నడిచింది, భార్యకు అనుమానం కలగకుండా చూసుకున్నాడు. కానీ, ఒక్క చిన్న పొరపాటు అతని జీవితాన్ని తలకిందులు చేసింది.

Also Read: Ganesh Mandapams Hyderabad: హైదరాబాద్ టాప్-7 గణేష్ మండపాలు.. ఇప్పుడు మిస్ అయితే.. ఏడాదంతా బాధపడాల్సిందే!

ఒక రోజు, ఈ వ్యక్తి గర్భనిరోధక మాత్రలు కొనడానికి స్థానిక మెడికల్ షాపుకి వెళ్లాడు. 15.8 యువాన్ (సుమారు రూ.200) బిల్లు వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో అతను మొబైల్ పేమెంట్ ద్వారా డబ్బు చెల్లించాడు, మాత్రలు తీసుకుని వెళ్లిపోయాడు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మెడికల్ షాపు కంప్యూటర్ సిస్టమ్‌లో పేమెంట్ ఫెయిల్ అవ్వడంతో డబ్బులు మధ్యలోనే ఆగిపోయాయి.

Also Read: MLA Murali Naik: పారిశుద్ధ్య విషయంలో అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్

డబ్బు రికవరీ చేసుకునేందుకు షాపు సిబ్బంది అతని మెంబర్‌షిప్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ, బాగోతం బయటపడే సమయం వచ్చింది. ఆ కాల్ అతని భార్య ఫోన్‌కి వెళ్లింది. భార్య ఫోన్ ఎత్తి, “మా ఆయన ఏం కొన్నారు?” అని అడిగింది. షాపు ఉద్యోగి, కొంచం కూడా ఆలోచించకుండా, “గర్భనిరోధక మాత్రలు” అని చెప్పేశారు. ఆ మాటలతో భార్యకు అసలు మ్యాటర్ మొత్తం విషయం అర్థమైంది. ఇన్నాళ్లూ భర్త చీకటి బాగోతం ఆమెకు తెలియకుండా నడిపాడని గ్రహించి, కోపంతో ఊగిపోయి, వెంటనే అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఒక్క కాల్ వల్ల రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.

Also Read: Barrelakka: వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క.. నాకు ఆ సమస్య ఉందంటూ కన్నీళ్లు.. ఏమైందంటే?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..