Pawan Singh: భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ తన తాజా పాట “సైయన్ సేవా కరే”తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ పాటలో అతనితో పాటు అంజలి రాఘవ్ కూడా కనిపించింది, వీరి జోడీ అభిమానులకు ఎప్పటిలాగే ఆకర్షణీయంగా అనిపించింది. ఈ ఆల్బమ్‌లో భార్యాభర్తల పాత్రల్లో నటించిన పవన్ , అంజలి, తమ నటనతో పాటు ఆకట్టుకునే సంగీతం, శక్తివంతమైన సాహిత్యంతో ఈ పాటను అభిమానుల మనసుల్లో నిలిపారు.
విడుదలైన కేవలం 5 గంటల్లోనే 4 లక్షలకు పైగా వీక్షణలు, 85 వేలకు పైగా లైక్‌లతో సోషల్ మీడియాలో ఈ పాట వైరల్‌గా మారింది. ఈ పాట వింటుంటేనే ఊపు వచ్చేస్తుంది. కదిలించేలా చేసే బీట్స్‌తో, ఈ పాట విన్నవారు డ్యాన్స్ చేయకుండా ఉండలేరు.
అయితే, ఈ పాట గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే పవన్ సింగ్ మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. ఓ వేదికపై అంజలి రాఘవ్‌తో కలిసి కనిపించిన పవన్, ఆమె ఆఫ్-వైట్ చీరలో అద్భుతంగా కనిపిస్తుండగా, ఆమె నడుమును తాకిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంలో పవన్ ఏదో సరి చేయడానికి ప్రయత్నించినట్లు కనిపించినప్పటికీ, అంజలి కాస్త అసౌకర్యంగా కనిపించింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పవన్‌ను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీని పై జోరుగా సాగుతున్నాయి. పవన్ సింగ్, అంజలి రాఘవ్‌ల ఈ కొత్త పాట “సైయన్ సేవా కరే” ఒకవైపు అభిమానులను అలరిస్తుండగా, వీడియో వివాదం మరోవైపు చర్చనీయాంశంగా మారింది. ఈ జంట మరోసారి తమ కెమిస్ట్రీతో, సంగీతంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. కానీ ఈ వివాదం వారి ఖ్యాతిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.