Kunamneni Sambasiva Rao: దేశంలో బీజేపీ(BJP) ప్రభుత్వం ఫాసిస్ట్ బాటలో పయనిస్తోందని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. మగ్దూం భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత మరిచి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పకుండా, మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. కాళేశ్వరం(Kaleshwaram) పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని హైలెట్ చేస్తూ రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్ధతి మార్చుకోవాలా..
రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాజెక్టులు విస్మరించి, కాళేశ్వరం ప్రధాన ఎజెండాగా వేల కోట్ల అప్పులు తెచ్చి మట్టిలో పోశారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, రైతాంగ సమస్యలపై పోరాటాలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. వేలాది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అధికారులు వారి గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా తొలిగించి నిరాశ్రయులను చేయడం సరికాదన్నారు. పేదల ఇండ్లను కూల్చడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీ(RTC)ని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతామన్నారు. సజ్జనార్ ముఖ్యమంత్రినా..? మంత్రినా..? ఎండీ నా..? ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్(Encounter Specialist) ఉండొచ్చు, అట్లాంటి భయానక వాతావరణం ఆర్టీసీ(RTC) కార్మికులపై సృష్టించడం సరైంది కాదన్నారు.
Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!
సాయుధ వారోత్సవాలు
కార్మికులపై సజ్జనార్ పద్ధతి మార్చుకోక పోతే ప్రత్యేక ఉద్యమాలు రూపొందించాల్సి వస్తుందని సూచించారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు జరుపుతామన్నారు. డిసెంబర్ 26 న కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాల సందర్భంగా ఖమ్మం(Khammam)లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల్ని, ప్రభుత్వం గుర్తించాలని, సాయుధ వారోత్సవాలను జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. 30న సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్(Congress) సీపీఎం(CPM) పార్టీలు కలిసొచ్చిన చోట కలిసి పోటీ చేస్తామని, పొత్తు లేని చోట ఒంటరిగా బరిలో నిలుస్తామన్నారు.
Also Read: Donald Trump: భారత్‌ను మళ్లీ గెలికేసిన ట్రంప్.. మళ్లీ అదే పాట.. ఇక మారవా?
