Harish Rao (imagecredit:Twitter)
Politics

Harsh Rao: ఆశల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం: హరీష్ రావు

Harish Rao: ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట తప్పడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. గొంతెమ్మ కోరిక అసలే కాదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశ కార్యకర్తల మహాధర్నా కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా? అని హెచ్చరించారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? కమిషన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వానికి పైసలు ఉంటాయన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదు కు గోదావరి, కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసి మోరీలు పూస్తా అని సీఎం అంటున్నాడని మండిపడ్డారు. గోదావరి నీళ్లను మూసిలో పోసేందుకు 6000 కోట్లను ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో 4000కోట్లతో ఎస్టీపీలను రేవంత్ రెడ్డి పెడుతున్నాడు కమీషన్లు, కాంట్రాక్టుల కోసం అని ధ్వజమెత్తారు.

భోజన కార్మికులకు జీతాలు

హెచ్ఎండీఏ 10వేల కోట్లతో టెండర్లు పిలిచారని, జీహెచ్ఎంసీలో 6000 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్లకు టెండర్లు పిలిచారు.. ఫ్యూచర్ సిటీ(Futer City)లో ఆరు లైన్ల రహదారి కోసం టెండర్లు పిలిచారు. అక్కడ సిటీ లేదు ఏమి లేదు. వీళ్ళు వీళ్ళ చుట్టాల భూములు ఉన్నాయని ధ్వజమెత్తారు. వీటన్నింటికీ మాత్రం పైసలు ఉన్నాయి..ఆశ కార్యకర్తలకు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవా? అని నిలదీశారు. ఈ 50 వేల కోట్ల కాంట్రాక్టు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. ఆశలకు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వనంటావా.. మాట తప్పావు రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఉద్యోగులు డీఏ అడిగినా, జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు అడిగినా డబ్బులు లేవు అని చెబుతావు.. ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అన్నావు 250 కోట్లతో.. 10వేల కోట్లతో టెండర్లు పిలిచారని, పేదల ఆరోగ్యం కోసం, ఊర్లలో పేదవారికి సేవ చేసే ఆశలంటే ఎందుకు చిన్న చూపు రేవంత్ రెడ్డి అని నిలదీశారు.

Also Read: Ganesh Chaturthi festival: వినాయక చవితి ఏర్పాట్లపై రంగారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు

స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఆశ కార్యకర్తలను పిలిపించి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. అసెంబ్లీని స్తంభింప చేసి అయినా సరే ఆశల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రారంభించిన పనులకు రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర జేబులో పెట్టుకొని రేవంత్ రెడ్డితిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు 4 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థులను మూడు రోజుల ముందే అరెస్ట్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఒక దవాఖాన కట్టింది లేదు.. బిల్డింగ్ కట్టింది లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడని, ఇప్పటివరకు 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రెండు ఏండ్ల నుండి స్కాలర్షిప్ లేదు.. దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా యూనివర్సిటీకి రా రేవంత్ రెడ్డి అని సవాల్ చేశారు.

Also Read: BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై.. విస్తృత సమావేశం

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?