Khammam Rains(image CREDIT: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు

Khammam Rains:  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్Police Commissioner Sunil Dutt) సూచించారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు.

ఇవాళ కూడా ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు.

Also Read: Gadwal Jodu Panchelu: గద్వాల సంస్థానాధీశుల వారసులు.. ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దు

భారీ వర్షాలు,(Heavy rains) వరదలు గత మూడు-నాలుగు రోజులుగా పినపాక నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా అంతరాయం చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అశ్వాపురం, కరకగూడెం మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ముఖ్యంగా, అశ్వాపురంలోని ఇసుక వాగు పొంగి ప్రవహించడంతో ఎలకలగూడెం, మనుబోతులగూడెం, గోత్తులగుంపు, ఎగులూరు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిపై ప్రభావం మణుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

హెచ్చరికలు జారీ

ఓపెన్ కాస్ట్ గనులు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.నీటిని మోటార్ల సాయంతో తోడుతున్నప్పటికీ, పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది. దీనివల్ల సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నది పరిస్థితి: గోదావరి నదిలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని,ప్రజలు గోదావరి దాటవద్దని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రయాణాలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 Also Read: Khammam District: భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. ఎక్కడంటే..?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?