Plants (Image Source: Freepic)
Viral

Plants: మనుషులకే కాదు.. మెుక్కలకూ ఆ ఫీలింగ్స్ ఉంటాయట.. అప్పుడవి ఏం చేస్తాయంటే?

Plants: మనుషులకు ఉన్న ఐదు ఇంద్రియాలు ఎప్పుడు చురుగ్గా పనిచేస్తుంటాయి. రుచి, స్పర్శ, చూపు, వినికిడి, వాసనను ప్రతీ రోజు మనుషులు అనుభవిస్తూనే ఉంటారు. ఇవి వాస్తవిక ప్రపంచంలో మనిషి ఏ విధంగా జీవించాలో తెలియజేస్తాయి. ఏదైనా ప్రమాదాలు ఎదురైనప్పడు మనుషులను హెచ్చరిస్తాయి. చేయి కాలగానే తీసేయడం, కారం వస్తువు తినగానే నీరు తాగడం, చెడు వాసన వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవడం, బిగ్గర శబ్దాలు విన్నప్పుడు పారిపోవడం వంటివి ఈ ఇంద్రియాల మూలంగానే మనిషి చేస్తుంటాడు. అయితే మనుషులకు ఉన్నట్లే మెుక్కలకు సైతం ఈ విధమైన ఇంద్రియ వ్యవస్థ, ఫీలింగ్స్ ఉంటాయని వృక్షశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా అవి స్పందిస్తాయని కూడా తెలియజేస్తున్నారు.

శాస్త్రవేత్త డా. కిమ్ జాన్సన్ ప్రకారం..
మెుక్కలకు కళ్లు, చెవులు, నాలుక లేకపోయినా.. వాటి వెదురు భాగం చాలా వరకూ ఇంద్రియ పనులను చేస్తుంది. వర్షం పడుతుందా? గాలి బలంగా వీస్తుందా? అన్న విషయాన్ని మెుక్కలు గ్రహిస్తాయి. మెల్ బోర్న్ విశ్వవిద్యాలయంలో బయో సైన్స్ శాస్త్రవేత్తగా ఉన్న డా.కిమ్ జాన్సన్.. మెుక్కల ఇంద్రియ జ్ఞానంపై అధ్యయనం చేస్తున్నారు. ఆమె మాటల ప్రకారం.. ‘మొక్కలు ఎల్లప్పుడూ ఆరు బయట ఉంటూ పర్యావరణం, వాతావరణ మార్పులకు గురవుతుంటాయి. మెుక్కల ఆకృతి లేదా ఆకారాన్ని పరిశీలిస్తే ఆ ఒత్తిడికి అవి ఎలా స్పందిస్తున్నాయో కనిపిస్తుంది. ఉదాహరణకు.. గాలి బలంగా వీస్తే మొక్క దానికి తట్టుకునేలా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. వేర్లు రాయిని తాకితే దాని చుట్టూ తిరిగి పెరుగుతాయి. అంటే వాటికి చుట్టూ ఉన్నదాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉంది’ అని ఆమె తెలిపారు.

మొక్కలు ఎలా పెరుగుతాయి?
డా. జాన్సన్ ప్రకారం.. ‘మనుషులు పుట్టే సరికి శరీర నిర్మాణం పూర్తిగా నిర్ణయించబడి ఉంటుంది. కానీ మొక్కలు పుట్టిన తర్వాతే తమ అవయవాలైన ఆకులు, వేర్లు, పూలు ఏర్పరుచుకుంటాయి. అయితే ఆ పెరుగుదల యాంత్రిక లేదా భౌతిక ఒత్తిడికి ఎలా నియంత్రించబడుతోంది? అనేదే నా పరిశోధన లక్ష్యం’ అని ఆమె తెలిపారు.

మొక్కల చర్మం పాత్ర
మనుషుల్లాగే మొక్కలకూ ఒక రక్షణ పొర ఉంటుంది. అదే ఎపిడర్మిస్ (Epidermis). ఇది మెుక్క లేదా చెట్టుకు కవచంలా ఉంటూ లోపలి నిర్మాణాన్ని కాపాడుతుంది. తద్వారా నీరు ఆవిరవకుండా సహాయపడుతుంది. అలాగే పర్యావరణ ఒత్తిడులను గుర్తించే ఇంద్రియాలు ఎపిడర్మిస్ లోనే ఉంటాయని డా. జాన్సన్ తెలిపారు. ‘మొక్కల ఎపిడర్మిస్ సన్నని కణజాల పొరతో ఏర్పడింది. ఇది తరచూ మైనం లాంటి పొరతో కప్పబడి ఉంటుంది. దీని వల్ల నీరు ఆవిరవకుండా భౌతిక నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఎపిడర్మిస్ నిరంతరం ఒత్తిడిలో ఉంటుంది. ఈ ఒత్తిడిలో మార్పులు జరిగితే మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి’ అని డా. జాన్సన్ అన్నారు.

Also Read: Pushpa 2 Ganesh Mandapam: విచిత్ర మండపం.. పుష్ప 2 స్టైల్లో, బన్నీ విగ్రహంతో.. ఇలా ఉన్నారేంట్రా!

చరిత్రాత్మక పరిశోధన
1800లలో శాస్త్రవేత్తలు.. ‘టిష్యూ టెన్షన్’ అనే ఘటనను గుర్తించారు. వారు సూర్యకాంతి కోసం మొక్క కాండంలో చిన్న కోత పెట్టగా బయటి పొర వెనక్కి సాగింది. లోపలి కణజాలం బయటకు వచ్చేసింది. దీన్ని బట్టి లోపలి కణజాలం బయటకు నెట్టబడే శక్తి కలిగి ఉండగా.. బయటి పొర సాగబడే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది.

సవాళ్లు, సమన్వయం
మొక్కల ఎపిడర్మిస్ చాలా క్లిష్టమైన పనిని చేస్తుంది. ఇది కేవలం ఒకే కణ పొర అయినప్పటికీ సూర్యకాంతి లోనికి వెళ్లేంత సన్నగా ఉండాలి. అదే సమయంలో ఒత్తిడి, దెబ్బల్ని తట్టుకునేంత బలంగా కూడా ఉండాల్సి ఉంటుంది. డా. జాన్సన్ మాటల్లో ‘ఎపిడర్మిస్‌పై ఎక్కువ ఒత్తిడి పడితే అది బలాన్ని పెంచుకోవచ్చు లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి సడలవచ్చు. ఈ పొర ఇలా అన్ని ముఖ్యమైన పనులు ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం’ అని ఆమె అన్నారు.

Also Read: Rare Disorder: ఓర్నాయనో.. ఇదేం వింత జబ్బురా అయ్యా.. మనుషుల ముఖాలు దెయ్యాల్లా కనిపిస్తాయట!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు