Ganesh Chaturthi: మహబూబాబాద్ జిల్లాలో వాడ వాడన, గల్లీ గల్లీలో గణనాధులు కొలువయ్యారు. బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు గణనాధులకు ఘనమైన పూజలు పూజారుల చేత భక్తులు అందించేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం(Khammam), సూర్యాపేట(Surapeta), కొత్తగూడెం(Kothagudem), ములుగు(Mulugu), మహబూబాబాద్(Mehabubabad) జిల్లాల్లో ప్రతి కాలనీలో విఘ్నేశ్వరుడు కొలువయ్యారు. విజ్ఞాలను తొలగించే విజ్ఞ నాయకుడికి భక్తులు విజ్ఞతతో పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా తీర్థప్రసాదాలు అందించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తమ కోరికలను విజ్ఞతతో విఘ్నేశ్వరుడిని కోరుకుంటారు.
తొమ్మిది రోజుల పాటు నిత్యం పూజలు నిర్వహించిన అనంతరం పదవ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో గణనాథులు భారీ సంఖ్యలో కొలువు తీరారు. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో వివిధ రకాల వ్యాపారులు గణనాథుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్విరాల ప్రభాకర్, చెర్విరాల ప్రవీణ్, నీరుటి సురేష్ నాయుడు, జతిన్ రవి, సంక సురేష్ లు పాల్గొన్నారు.
Also Read: Hydraa: బిగ్ బ్రేకింగ్.. చెరువుల పై ప్రత్యేక నిఘా.. అలా అస్సలు చేయొద్దు?
గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ఖమ్మం(Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి(Nelakonda Pally) పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు జెర్రిపోతుల అంజని, సోమన బోయిన సాయి నవీన్, రాయపూడి రోహిత్, ప్రజాపత్ విశాల్, ప్రజాపత్ తానారాం, సోమనబోయిన సాయి కిరణ్, కాసాని మహేష్, దేశ బోయిన శ్రీనివాసరావు, పెరిమల నిశాంత్, పిట్టల సాయి, సమ్మటి శివ గణేష్, ప్రజాపత్ దిలీప్, గొలుసు వంశీ, ఎడవెల్లి సూర్య,జంగిలి హర్షవర్ధన్, కొమ్మన బోయిన చిన్న బాబు, ప్రజాపతి కృష్ణ, లలిత్ కుమార్, శ్రీరామ్, సంపత్, మనీష్, కమలేష్,తదితరులు పాల్గొన్నారు.
వాడవాడలా కొలువైన గణపతి
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామునే నుండే గణపతి పూజలు కీర్తనలతో అన్ని వాడల్లో మారుమ్రోగుతున్నాయి దమ్మపేట మండల కేంద్రంలో వర్తకసంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక ఉత్సవాలలో ప్రముఖ పండితులు చామర్తి సాయి ప్రసాదశాస్త్రి చేతుల మీదుగా పూజలు ప్రారంభమయ్యాయి ఈ పూజాకార్యక్రమాలో మహిళలు అన్నిరకాల వ్యాపారస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read: Hanumakonda District: భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి.. కలెక్టర్ కీలక అదేశాలు