Gadwal District ( image CREDIT: SWETCHA REPORTER)
Politics, నార్త్ తెలంగాణ

Gadwal District: నడిగడ్డలో ఊహకందని రాజకీయాలు.. స్థానిక సంస్థల ఎన్నికలో పై చేయి ఎవరిది?

Gadwal District: సామాన్యుడి ఊహకందని రీతిలో నడిగడ్డ రాజకీయాలు నడుస్తున్నాయి.‌‌ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించడానికి ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయా లేదా… కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు పెరుగుతున్న అసంతృప్తితో ఆ పార్టీ నాయకులు పార్టీలు మారుతున్నారా అనేక సందేహాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి గెలుపొందిన గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరడంతో పార్టీఫిరాయింపుల చట్టం కిందా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు సీరియస్ గా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు నోటిసులు అందజేసి మూడునెలల సమాధానం సమర్పించాలని ఆదేశాలు జారీచేయడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయకముందే ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒక వేళ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గద్వాల ఎమ్మెల్యే పై వేటు తప్పదా? లేక తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ ప్రస్తుత ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఒక కోణంలో ఆలోచిస్తే గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడకపోవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల తీర్పుకు మరి కొంత కాలం వేచి చూడకతప్పదు.

 Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు

తికమక పడుతున్న పార్టీలు

గత కొంతకాలంగా గద్వాల(Gadwala)లో జరుగుతున్న రాజకీయాలు పరిశీలిస్తుంటే రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు సైతం అంతు చిక్కడం లేదని స్పష్టమవుతోంది. ఒక వేళ గద్వాల ఆసెంబ్లీ‌ స్థానానికి బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో.. ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో.., ఏ పార్టీ ఓడిపోతుందో.. అనే అంశాలపై వాస్తవాలను అంచనా వేయడం కష్టంగా మారింది. రాష్ట్ర చరిత్రలో ఇంతలా తికమక పెట్టే కీలక పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదనే చెప్పాలి.

పార్టీలు మారుతున్న నాయకులు
2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఉన్న రాజకీయాలను పోల్చి చూసుకుంటే అప్పుడు ఉన్న అంగబలం ఏ ఒక్క నాయకులలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల‌‌ ముందు బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్న నాయకుల మద్య వార్ ముదరడంతో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పటి జెడ్పీ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీలో‌ చేరి ఆపార్టీ నుంచి పోటి చేయగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసింది. ఓటమిపాలైన అధికారం కాంగ్రెస్ పార్టీ చేజించుకోవడంతో ఓటమి పాలైన అభ్యర్థి సరిత ఆత్మవిశ్వాసంతో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది.

ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు‌. కండువా కప్పుకోకున్న అధికార పార్టీ అభివృద్ది కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీలో ఇద్దరి మద్య వార్ మరోసారి మొదలైంది. స్తబ్దుగా ఉన్న రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకరి వర్గం మరోవర్గం నాయకుల మద్య యుద్ద వాతావరణం నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.‌ నేతల మద్య ఉన్న వార్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కాని.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నదం అవుతున్న వేళ… రాజకీయాలు మరింత వేడెక్కాయి. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు ఏవర్గం అనేది తేలనుంది.

“లోకల్” బాడీ ఎన్నికలు…ఎవరు ఎటూ?

తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికార పార్టీలో ఉన్న ఆశావాహకులకు లోకల్ బాడీ ఎన్నికలల్లో బీ ఫారమ్ లు ఏ వర్గాన్నికి దక్కుతాయోనని తికమకపెడుతోంది. ఒక వేళ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులకు అధిష్ఠానం బీఫారమ్ లు అందజేస్తే, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓటమి పాలైన సరిత వర్గీయుల‌ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఎలాగో అధికార పార్టీలో ఉంటే భీఫారాలు ఎలాగో దక్కవని తెలిసి కొందరు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు టచ్ లోకి వెళ్లిపోయారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలల్లో నోటిఫికేషన్ విడుదలైతే మరికొందరు కూడా పార్టీలు మారే అవకాశం ఉందని ఊహాగానాలు వినపడుతున్నాయి. పార్టీ మారెదెవరో అనేది మరి కొంతకాలం వేచి చూడాలి మరీ.

బై ఎలక్షన్స్ వస్తే మారనున్న రాజకీయాలు

బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడనుందా? అనర్హత వేటు పడకముందే ఎమ్మెల్యేనే స్వయంగా రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు‌. బై ఎలక్షన్ లు వస్తే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తికమకపడుతున్నారు. ఒక వేళ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి అధిష్టానం అవకాశం ఇస్తే.. అదే పార్టీలో ఉన్న సరిత మరో పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేక‌.. అదిష్ఠానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా పోటి చేసిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని పక్కనపెడితే… ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న బీఅర్ఎస్, బీజేపీ, వామపక్షాల పార్టీలో నుంచి ఎవరు పోటీ చేస్తారో అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

మున్సిపల్ మాజీ చైర్మన్ తిరిగి బీఆర్ఎస్ లోకి !

గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ , మరి కొందరు నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో గద్వాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పార్టీ చేరికపై సుముఖత చూపి వచ్చేనెల 6 న గద్వాలలో బహిరంగ సభ నిర్వహించి తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జిగా బాస్ హనుమంతు నాయుడు కొనసాగుతున్నాడు. తాజాగా గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీలోకి రానున్నడంతో పార్టీ బలం పుంజుకోనుంది. అయితే బిఎస్ కేశవ్ గద్వాల మున్సిపాలిటీకే పరిమితమవుతారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

అందుకే పక్క పార్టీవైపు చూపులు..

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భీఫారాలు ఎలాగో రావని తెలిసిన నాయకులు నెమ్మదిగా పక్క చూపులు మొదలుపెట్టారు. కొంతమంది అధికార పార్టీ బాట వీడి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా ఊహకందని పరిణామాలతో గద్వాల రాజకీయాలు రంజుగా మారనున్నాయి.
 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు