Adluri Laxman: సిరిసిల్ల ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారినే కేటీఆర్ నట్టేట ముంచాడు. బీఆర్ఎస్(BRS) సర్కారు ఉన్నప్పుడు బాకాయిలు పెట్టీ ఎలా వెళ్ళిపోయారో ప్రజలు గమనిస్తున్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టారని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,(Minister Tummala Nageswara Rao) అడ్లూరి లక్ష్మణ్(Adluri Lakshman) అన్నారు. సిరిసిల్ల పట్టణంలో నేతన్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్) నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రులు చేనేత కార్మాకులు నేసిన వస్త్రాలు పరిశీలించి వేదికపై ప్రదర్శించారు.
Also Read: Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. భార్యకు నచ్చకపోతే! ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా!
కార్మికులకు చెక్కులు అందించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం సాధ్యంకాదు అని ఇతర పార్టీలు అన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసి అది సాధ్యం అని హామీని నెరవేర్చి నిరూపించాము. ఇప్పటికే రెండు వందల కోట్లు మహిళలు ఉంచితంగా ప్రయాణించి రికార్డు సృష్టించారు. రూ.33 కోట్లు బాకిని తీర్చే బాధ్యత నాది, మీకు రావాల్సిన బాకీ డబ్బులు మీకు ఇస్తామన్నారు. బ్యాక్ బిల్లింగ్ గురించి కేబినేట్ లో చర్చించి నేతన్నలు అమలు అయ్యేవిదంగా చూస్తామన్నారు. రైతాంగం పండించిన సన్న ధాన్యం కు రూ.500 బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండిచేందుకు ప్రభుత్వం చేయూత నిచ్చింది.
మహిళలకు నాణ్యమైన చీరలు
గ్యాస్ రూ.500 లకే ఇస్తామని చెప్పాం ఇస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం లో కరెంటు ఉండదు అన్నారు, ఒక్క నిమిషం కూడా పోకుండా కరెంటు ఇస్తున్నామన్నారు. ఎప్పుడు రిజర్వాయర్ నింపాలి, రైతులను ఎలా ఆదుకోవాలి అని చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పంటలకయినా తెలంగాణా ఫస్ట్ అనే విదంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. నేత కార్మికులకు జ్యోతిభాపూలే సావిత్రి బాయి పూలే జన్మదినం సందర్బంగా హామీ ఇవ్వగా ఇప్పుడు నెరవేర్చామన్నారు. మీకు ఎన్ని సమస్యలు వున్నా తీర్చడం మాదే బాధ్యత అన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలు ఇవ్వటానికి ప్రభుత్వం పూనుకుంది. ఒక కోటి నాలుగు లక్షల చీరలకు కావాలి మీరు రోజు మొత్తం పనిజేసిన కావు మీకు 24 గంటల పని ఉంటది మేము సిరిసిల్ల వారికి రుణపడి వుంటామని మంత్రి తుమ్మల అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్
బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నన్నీ రోజులు మేమే రాజులం, మేమే మంత్రులం అని విర్రవీగారు. ఈప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారినే కేటీఆర్ నట్టేట ముంచాడని ఆరోపించారు.
వారి సర్కారు ఉన్నప్పుడు కార్మకులకు బాకాయిలు పెట్టీ ఎలా వెళ్ళిపోయారో మీకు తెలుసు అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.
Also Read: Dog Bite: కుక్క కాటు వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా?