Gadwal Jodu Panchelu: రాజుల రాజ్యాలు పోయినా గద్వాల(Gadwala) సంస్థానాధీశుల వారసులు మాత్రం అనవాయితీని కొనసాగిస్తున్నారు. ఆది మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ముని మనవరాలు కుమారుడు రాజ రాంభూపాల్(Raja Rambhupal) మాత్రం నేటికీ వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు గద్వాల(Gadwala) సంస్థానం నుండి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు ఒంటిపూట భుజించి నిష్ఠతో స్వామివారికి చేనేత కార్మికులు నేసిన ఏరువాడ జోడు పంచెలు బ్రహ్మోత్సవాల సమయంలో మొదటిసారిగా స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. నాటి రాజుల తర్వాత మొదటిసారి స్వయంగా వెంకన్నకు జోడు పంచెలు తాజ్ కృష్ణ అధినేత గద్వాల(Gadwala) సంస్థానాధీశుల వారసుడు రాజా రాంభూపాల్ (Raja Rambhupal)అందజేయడం విశిష్టత సంతరించుకుంది.
Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు
400 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ
గద్వాల(Gadwala) సంస్థానాదిశుల వారసుల నుండి గత 400 ఏళ్ల నుండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటిసారిగా స్వామి వారికీ ఏరువాడ జోడు పంచలు అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. రాజులు రాజ్యాలు పోయిన తర్వాత భక్తిశ్రద్ధలతో 41 రోజులపాటు చేనేత కార్మికులు నేసిన ఏరువాడ జోడు పంచలు రాజుల తరపున మహంకాళి వంశస్థులు అందజేస్తూ వస్తున్నారు. మొదటిసారిగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ముని మనవరాలు బిడ్డ రాజా రాంభూపాల్ స్వయంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏరువాడ జోడు పంచలు అందజేయడం ప్రాముఖ్యత సంతరించుకున్నది.
రాజా రాంభూపాల్ అన్ని ఏర్పాట్లు
41 రోజులపాటు నిష్ఠలతో స్వామివారికి ఏరువాడ జోడు పంచలు నేసిన చేనేత కార్మికులను సైతం స్వామివారి సేవకు తీసుకపోవడానికి రాజా రాంభూపాల్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ అవకాశం పొందిన చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. గద్వాల సంస్థానంలో సాహితి పోషకులలో చెప్పకోదగ్గ రాజు శ్రీ మహారాజా సీతారామభూపాలుడు 1924లో స్వర్గస్తు లైనారు. తరువాత పాలన బాధ్యతలు శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ 1929లో చేపట్టారు. 1949లో జాగీరుల రద్దుతో రాణి పాలన ముగిసంది.
గద్వాల చరిత్ర సువర్ణక్షరాలతో లిఖించదగ్గది
ఆమె చేసిన 25 సంవత్సరాల పాలనలో ఎన్నో విజయాలు. మన్ననలను, ప్రశంసలను రాణి అందుకున్నారు. 25 సంవత్సరాల రాణి పాలనను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గదిగా ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు.ఆమె మనవడు రాజ రాంభూపాల్ బహుదూర్ గద్వాల సంస్థానాధీశులు చరిత్రను యధావిధిగా కొనసాగించడానికి అతనే తిరుమల తిరుపతి వెంకన్న కు ఏరువాడ జోడు పంచెలు అందజేయనున్నడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
Also Read:Jogulamba Gadwal: రైతులను వెంటాడుతున్న యూరియ కష్టాలు