CPM Leader John Wesley: వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నప్పటికీ, రైతులకు కావాల్సిన యూరియాను అందించడంలో కేంద్రం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley)మండిపడ్డారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులు యూరియా కొరకు నెల రోజులుగా రోడ్లపైకి వస్తున్నప్పటికీ బీజేపీ(BJP) నాయకులు కుంటి సాకులు చెబుతూ ‘కృత్రిమ కొరత’ సృష్టించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు
పడిగాపులు కాస్తున్నారు
ఈ తప్పుడు ప్రచారాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఇప్పటికైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సినంత యూరియాను తెప్పించడానికి బీజేపీ(Bjp) ఎంపీలు, కేంద్ర మంత్రులు సహకరించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన యూరియా కొరతను సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. దీంతో రైతులంతా సహకార సంఘాలు, షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల ముందు, రహదారుల మీద నిరసనలు తెలియజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడంలేదు
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచైనా రాష్ట్ర అవసరాలకు యూరియాను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినా ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 45 కేజీల యూరియా బస్తా రూ.242లు కాగా, ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో రు.350కి అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం యూరియా కొరతను తీర్చడానికి, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడానికి ప్రభుత్వ సంస్థలైన హాకా, సహకార సంఘాల ద్వారా సరిపడా ఎరువులను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్రం నుంచి తెప్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని, రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Mulugu Politics: ప్రజా పాలన పై మాట్లాడే హక్కు మీకు లేదు..?