Ganesh idol (Image Source: Twitter)
తెలంగాణ

Ganesh idol: సీఎం రేవంత్ గెటప్‌లో వినాయకుడు.. తెలంగాణ రైజింగ్ పేరుతో స్పెషల్ మండపం

Ganesh idol: వినాయక చవితి అనగానే ఊరూరా సందడి మెుదలవుతుంది. వీధుల్లో విభిన్నమైన వేషాధారణల్లో ఉన్న విఘ్నేశ్వరుడ్ని ప్రజలు ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. అయితే సినిమాల్లోని హీరో పాత్రల్లో విగ్రహాలను తీసుకొచ్చి ఏర్పాటు చేసిన సందర్భాలను గతంలో చాలానే చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో ఏర్పాటు చేసిన ఓ వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈసారి సినీ నటులను కాకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తిరేపుతోంది.

ఇంతకీ ఎక్కడంటే?
హైదరాబాద్ గోశామహల్ నియోజకవర్గంలో ఈ వినూత్నమైన గణనాథుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో అక్కడ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో రూపొందించిన ఈ మండపంలో ప్రతిష్టించిన విగ్రహం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెటప్ ను పోలి ఉంది. సీఎంను అనుకరిస్తూ విగ్రహం హావభావాలు ఉన్నాయి. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్తున్నారు.

Also Read: Trump Tariffs Impact: భారత్‌పై 50 శాతం సుంకాల బాంబ్.. రంగాల వారీగా ప్రభావమెంత?

సీఎం నివాసంలో ఘనంగా వేడుకలు
ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి రేవంత్.. పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం సీఎంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. సుఖ శాంతులతో, సుభిక్ష కాంతులతో, సకల సంపదలతో, తెలంగాణ వర్థిల్లాలని ఆ గణనాథుడ్ని కోరుకంటున్నట్లు రాసుకొచ్చారు.

Also Read: Donald Trump: భారత్‌ను మళ్లీ గెలికేసిన ట్రంప్.. మళ్లీ అదే పాట.. ఇక మారవా?

భారీ వర్షాలపై కీలక ఆదేశాలు
హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సీఎం పేర్కొన్నారు.

Also Read: Massive Flash Floods: పోటెత్తిన వరద.. విరుచుకుపడ్డ కొండచరియలు.. ఎటు చూసినా అల్లకల్లోలమే!

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?