Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి..?

Crime News: బాలునిపై లైంగిక దాడి జరిపిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్​ కోర్టు జడ్జి ఎన్​.అమరావతి తీర్పు చెప్పారు. పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు. బాధిత బాలుని కుటుంబానికి 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్(UP) కు చెందిన ఓ వ్యక్తి ఉపాధిని వెతుక్కుంటూ వచ్చి జీడిమెట్ల మగ్ధూం నగర్ లో కుటుంబంతో సహా స్థిర పడ్డాడు. కాగా, 2017, జూన్​ 26న ఆ వ్యక్తి ఏడేళ్ల కొడుకు ఇంటి బయట ఆడుకుంటుండగా అదే ప్రాంతంలో నివాసముంటున్న గిరిధర్ కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

హెచ్ఎంటీ(HMT) ప్రాంతంలోని అటవీ ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలునిపై అఘాయిత్యం జరిపాడు. బాధితుని ద్వారా విషయం తెలిసి ఆ చిన్నారి తండ్రి జీడిమెట్ల పోలీసుల(Gedimetla Police Station)కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పీ.శ్రీనివాస్ నిందితున్ని అరెస్ట్ చేశారు. ఆధారాలు సేకరించి కోర్టుకు ఛార్జిషీట్ ను సమర్పించారు. కేసును విచారించిన జడ్జి మంగళవారం నిందితుడైన గిరిధర్ కుమార్(Giridhar Kumar) కు యావజ్జీవ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Also Rad: Etela Rajender: కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్

వెస్ట్ బెంగాల్​ యువకుని హత్య

ఉపాధిని వెతుక్కుంటూ వచ్చిన వెస్ట్ బెంగాల్​ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఐటీ(IT) కారిడార్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పొట్టకూటి కోసం పశ్చిమ బంగ నుంచి వచ్చిన జెట్ రోహర్​ (18) పోచారం ఇన్ఫోసిస్​ ప్రాంతంలోని ఏఎస్​బీఏఎల్(ASBAL) లేబర్ క్యాంప్​ లో పని చేస్తున్నాడు. కాగా, సోమవారం రాత్రి దుండగులు అతన్ని గొంతులో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు సమాచారం అందగా సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు పంచనామా జరిపి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) మార్చురీకి తరలించారు. జెట్ రోహర్ ఉంటున్న లేబర్ క్యాంప్ లో నివాసముంటున్న వారే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Also Read: Hydraa: జూబ్లీహిల్స్‌లో కబ్జా భూమికి విముక్తి.. 100 కోట్లు సేఫ్!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?