Mulugu Politics: కొమరం లక్ష్మీకాంతమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, ఖబర్దార్ బత్తుల రాణి నువ్వు జాగ్రత్తగా మెదులుకోవాలని ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గుంటూరు పావని హెచ్చరించారు. ఆమె ములుగులో మాట్లాడుతూ.. నీకు నిజంగా ధైర్యం ఉంటే ములుగు గట్టమ్మ దేవాలయం వద్దకు రా.. చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధం అయితే రావాలని సవాల్ విసిరారు. ఇర్ప విజయ సీతక్క దగ్గర పైసలు తీసుకున్నదని మేము అనలేదే అని గుర్తు చేశారు. నమ్మక ద్రోహం చేసిందని అంటున్నామన్నారు. ఇర్ప విజయ కుమార్తె వివాహం దగ్గరుండి మరి సీతక్క(Seethakka) చేయించిన సందర్భంగా సీతక్క ఋణం తీర్చుకోలేనని అన్న మాట వాస్తవమో.. కాదో మీ ఇర్ప విజయను అడిగి తెలుసుకో… గుర్తు చేశారు. మీకు పైసలు గొప్పవేమో కానీ మాకు మాట గొప్పదని హితవు పలికారు. ఇచ్చిన మాటను తప్పినందుకు గాను మేము నమ్మక ద్రోహి అంటున్నామని తెలిపారు. మాటను గౌరవించే మనుషులం కాబట్టి అడుగుతున్నామని చెప్పారు. ఇచ్చిన మాట తప్పినపుడే ఆమె విలువ ఏంటో అర్థమవుతుందన్నారు.
ప్రజల మీద సరైన అవగాహన
దళిత ముఖ్యమంత్రి ఏమైంది, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంది, హైదరాబాద్ మరియు వరంగల్ నగరాలు సింగపూర్, ఇస్తాంబుల్ ఏమైంది అని అడిగితే కాకమ్మ కథలు చెప్తున్నారని మండిపడ్డారు. 2023 సంవత్సరంలో వరదల్లో ఇళ్లు, వాకిళ్ళు, పంట పొలాలు కొట్టుకుపోతే వారికి ఇచ్చిన నష్టపరిహారం ఎంత అని అడిగితే చనిపోయిన ప్రాణాల గురించి చెప్తున్నారు ఏంటో… అర్థం కావడం లేదన్నారు. మీకు కనీస అవగాహన ఉంటే వరదల్లో చిక్కుకొని ప్రాణ నష్టం జరిగిన వారికి (NATIONAL DISASTER RESPONSE FUND), (STATE DISASTER RESPONSE FUND) ఇచ్చినామని అంటున్నారు. వర్షాకాలం ముంపు ప్రాంతాల ప్రజల మీద సరైన అవగాహన లేకనే, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు. పిట్టల దొర లాగా కేసీఆర్(KCR) వరదల సమయంలో భద్రాచలం వచ్చి, పంటలకు నష్టపరిహారం కల్పిస్తా అని మాట ఇచ్చి ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదనీ దుయ్యబట్టారు. నీ దగ్గర ఆధారాలు ఉంటే రా ఇక్కడ నిగ్గు తేలుద్దాం.. ఇకనైనా గత పది సంవత్సరాల కాలంలో అసలు మీ జ్యోతమ్మ తెచ్చిన నిధులు ఎన్ని? జెడ్పీ నుండి ఆమె తెచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారు.
Also Read: Viral News: వెడ్డింగ్ కార్డ్ అనుకొని ఫైల్ ఓపెన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి.. ఊహించని ట్విస్ట్
పంతొమ్మిది నెలల పాలనలో
మొన్నటి దాకా మా పార్టీలో ఉండి పార్టీ మారిన వారు కూడా మా జిల్లా అధ్యక్షురాలు గురించి మాట్లాడుతున్నారు. అమరుడైన శ్రీకాంత చారి తల్లికి కేసీఆర్(KCR) ఎమ్మెల్సీ(MLC) పదవి ఎందుకు ఇవ్వలేదు, తన కూతురు కవితకు ఎందుకు ఇచ్చాడో దమ్ముంటే రా చెప్పుదువురా.. నిలదీశారు. పదేండ్ల పాలనలో బి.ఆర్.ఎస్(BRS)పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి? పంతొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్(Congrees) ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అనేది నేను చెప్తానని స్పష్టం చేశారు. మా లక్ష్మీ కాంతమ్మ ఇవ్వాళ 12:00 గంటలకు ఏటూరునాగారం అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రమ్మని చెప్పింది. దమ్ముంటే చర్చకు రావాలి, కానీ సామాజిక మాధ్యమాల్లో మేము సిద్ధం మీరు సిద్దమా ఏంటి ఇది. ఇంకా గంట సమయం ఉందని అన్నారు.
ఎంత ఇచ్చారో చెప్పండి
అటవి హక్కుల చట్టం తెచ్చి పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. నా దగ్గర రుజువులు ఉన్నాయి. నీకు ఒకవేళ తెలియకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన పోడు రైతులను నేను పట్టుకుని వస్తా.. చర్చలో కూర్చుందాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పోడు హక్కు పత్రాలను రద్దు చేసి పోడు భూముల రైతుల మీద అటవి అధికారులతో దాడి చేయించిన క్రూరమైన పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ. నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి మీకు దమ్ముంటే చర్చకు రండి. మీ పదేండ్ల పాలనలో వరదల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంత ఇచ్చారో దమ్ము ఉంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని అన్నారు. ఇవ్వాళ జ్యోతమ్మ ప్రాథమిక విద్యను అభ్యసించిన అది కాంగ్రెస్ పుణ్యమే.. ఉన్నత విద్యను అభ్యసించిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పుణ్యమే. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆమె లేనే లేదు. చర్చకు నేను సిద్ధంగా ఉన్న, మీరు సిద్ధమా అని అన్నారు.
Also Read: Hydraa: బిగ్ బ్రేకింగ్.. చెరువుల పై ప్రత్యేక నిఘా.. అలా అస్సలు చేయొద్దు?