Kashmir Floods
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో కుంభవృష్టి.. వరదల్లో 9 మంది మృతి

Cloudburst: భారీ వర్షాలు, క్లౌడ్‌ బరస్ట్‌లు (Cloudburst), వరదలతో జమ్మూ కశ్మీర్ అతలాకుతలం అవుతోంది. డోడా జిల్లాలో భారీ వర్షాలు, ఫలితంగా వరదలు ముంచెత్తడంతో 9 మంది మృత్యువాతపడ్డారు. చాలామంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు వైష్ణో దేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో మంగళవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, వైష్ణోదేవీ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయకు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయని ఆలయ బోర్డు కూడా ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. అవసరమైన సిబ్బంది, యంత్రాలతో ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

కొండచరియలు విరిగిపడిన చోట అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇల్లు కూలిపోయిన కారణంగా ఇద్దరు మృతి చెందగా, అకస్మాత్తుగా వచ్చిన వరదలలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఒక చోట క్లౌడ్‌బరస్ట్ జరిగిందని, అందుకే అకస్మాత్తుగా వరదలు వచ్చిపడ్డాయని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల ఒడ్డుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా డోడా, కిష్ట్వార్‌లను కలిపే జాతీయ రహదారి-244పై ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం, పలుచోట్ల రాళ్లు పడటంతో రహదారి బాగా ధ్వంసమైంది.

Read Also- Sports News: ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

చాలా చోట్ల ఇదే పరిస్థితి
జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శ్రీనగర్ నుంచి జమ్మూ తాను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నానని ఆయన తెలిపారు. అత్యవసర మరమ్మతులు, ఇతర అత్యవసర పనుల కోసం జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే అదనపు నిధులు అందుబాటులో ఉంచాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

Read Also- Govt On Parents: తల్లిదండ్రులను విస్మరిస్తే కటకటాలే.. రోడ్డుపై వదిలేసినా క్రిమినల్ కేసులు

ప్రస్తుత పరిస్థితి ఇదీ
జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర వర్షాల నేపథ్యంలో తవి (Tawi), రావి (Ravi) నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కథువా జిల్లాలో రావి నది పలుచోట్ల పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కశ్మీర్‌ వ్యాలీతో కిష్ట్వార్‌ను కలిపే సింథన్ టాప్‌ (Sinthan Top) మార్గాన్ని కూడా మూసివేశారు. రాంబన్ జిల్లాలో రాళ్లు పడటంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. జోజిలా పాస్‌లో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిని కూడా మూసివుంచారు.

వర్షాలు, వరదలు నేపథ్యంలో పలు జిల్లాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. కాగా, జమ్మూ ప్రాంతంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?