Hanumakonda District: భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి..
Hanumakonda District ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Hanumakonda District: భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి.. కలెక్టర్ కీలక అదేశాలు

Hanumakonda District: భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Collector Sneha Shabarish)అన్నారు.  హనుమకొండ జిల్లా శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ, ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా భూభారతి దరఖాస్తులు(Bhubharati Applications) ఎన్ని వచ్చాయని, అందులో ఎన్నిటిని ఆమోదించారని, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణ అయ్యాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

 Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!

 దరఖాస్తులపై విచారణ చేయాలి

వచ్చిన దరఖాస్తులలో ఏఏ కారణాల చేత తిరస్కరణ అయ్యాయని, తిరస్కరణ అయిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయాలని, ఏయే ఆధారాలతో భూమిపై ఉన్నారనే వివరాలను విచారించాలన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కార చర్యలను మరింత వేగవంతం చేయాలని, ప్రతిరోజు పురోగతి ఉండాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో మాట్లాడి వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..