PM Modi (Image Source: twitter)
జాతీయం

PM Modi: మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్.. ప్రధాని మోదీ స్వయంగా..

PM Modi: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. గుజరాత్ హన్సల్ పుర్ లో మారుతీ సుజుకీ ఏర్పాటు చేసిన మోటార్ ప్లాంట్ ను ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) తన చేతుల మీదుగా ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలి ఈవీ కారు ఇ-విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మోదీ ఆవిష్కరించారు. ఇక్కడ ఉత్పత్తి కానున్న ఈవీ కార్లు.. 100 దేశాలకు పైగా ఎగుమతి అవుతాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మోదీ ఇంకా ఏం చెప్పారంటే?
ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘భారత్ ఇక్కడే ఆగబోవడం లేదు. మనం మంచి ఫలితాలు సాధించిన రంగాల్లో ఇంకా మెరుగ్గా రాణించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే మిషన్ మాన్యుఫాక్చరింగ్ పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ఫోకస్ భవిష్యత్ పరిశ్రమలపై ఉండబోతుంది. సెమికండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందుకు వెళ్తోంది. ఆటో ఇండస్ట్రీకి అవసరమైన రేర్ ఎర్త్ మాంగనీస్ లోపాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ దిశలో పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించాం. దీని కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అన్వేషణ మిషన్‌లు నిర్వహించి కీలక ఖనిజాలను గుర్తించబోతున్నాం’ అని మోదీ తెలిపారు.

అంతకుముందు ఎక్స్ వేదికగా..
మారుతి సుజుకి ఈవీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఈరోజు భారతదేశం స్వావలంబన దిశగా గ్రీన్ మొబిలిటీ కేంద్రంగా మారే క్రమంలో ప్రత్యేకమైన రోజు. హంసల్పూర్‌లో e-విటారాను ప్రారంభించబోతున్నాం. ఇది మేడ్ ఇన్ ఇండియా BEV (Battery Electric Vehicle). 100కుపైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. అదేవిధంగా గుజరాత్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. ఇది మన బ్యాటరీ ఎకోసిస్టమ్‌కి విశేష బలాన్ని ఇస్తుంది’ అని పేర్కొన్నారు.

Also Read: Indian Railways: రైళ్లల్లో విచిత్రమైన సమస్య..15 వేలకు పైగా ఫిర్యాదులు.. మీరూ ఫేస్ చేశారా?

ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం
ఇదిలా ఉంటే ఇ-విటారా వెహికల్ ద్వారా మారుతి సుజుకి అధికారికంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించినట్లైంది. ఇక్కడ తయారయ్యే బీఈవీలు.. యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సహా 100కుపైగా దేశాలకు ఎగుమతి అవుతాయి. దీంతో సుజుకి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్ అవతరించనుంది. ఇ-విటారా వాహనం విషయానికి వస్తే.. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 49 కిలోవాట్‌ అవర్ బ్యాటరీతో రాబోయే కారు 144BHP పవర్ ను, 189nm టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. 61kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే వేరియంట్.. 174 BHP, 189 Nm టార్క్ ను జనరేట్ చేస్తుందని సుజుకి నిర్వాహకులు తెలిపారు. హై రేంజ్ వేరియంట్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ పైగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

Also Read: Mother kills daughter: రాష్ట్రంలో ఘోరం.. 3 ఏళ్ల కూతుర్ని చంపి తల్లి కూడా.. కారణం తెలిస్తే షాకే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ