Teachers MLCs (imagecredit:swetcha)
తెలంగాణ

Teachers MLCs: సెప్టెంబర్ 1న ‘హమారా విద్యాలయ-హమారా స్వాభిమాన్’ కార్యక్రమం!

Teachers MLCs: హమారా విద్యాలయ్-హమారా స్వాభిమాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి(AVN Reddy), మల్కకొమరయ్య(Malkakomaraiah) తెలిపారు. హైదరాబాద్(Hyderabad)లోని కేశవ్ మెమోరియల్ పాఠశాలలో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) రాష్ట్ర కార్య నిర్వాహక వర్గ సమాశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరై టీపీయూఎస్ మాతృ సంస్థ ఏబీఆర్ఎస్ఎం(ABRSM) దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 1న జరగబోయే హమారా విద్యాలయ్-హమారా స్వాభిమాన్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు(Hanumantha Rao), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్(Navath Suresh) తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు.

Also Read: Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటరు జాబితా సవరణకు సిద్ధం!

సమస్యలపై చొరవ

రాష్ట్ర ప్రభుత్వం.. సర్కార్ బడుల బలోపేతం కోసం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కంకణబద్ధులై పనిచేయాలని కోరారు. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వారు వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యలపై చొరవ చూపించి పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్(CPS) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు(Hanumantha Rao) మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ఉపాధ్యాయుల బాధ్యత అని గుర్తు చేశారు.

అందుకే సెప్టెంబర్ 1న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ ప్రతినిధులు పాలేటి వెంకట్రావు, డాక్టర్ సూరం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుపల్లి పాపిరెడ్డి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిలు బండి రమేశ్, తెలకలపల్లి పెంటయ్య, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.

Also Read: Medchal District: బాచుపల్లిలో నయా దందా రికార్డుల తారుమారు.. అసలైన పట్టాదారుల భూములు క‌బ్జా?

Just In

01

Viral Accident: ఆ చిన్న రోడ్డు ప్రమాదానికి.. యావత్ దేశమే షాక్.. అంతలా ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మొంథాతుపాన్ ప్రభావంపై.. ఆఫీసర్లకు సీఎం కీలక అదేశాలు!

Bigg Boss Telugu 9: భరణి కోసం దివ్య.. శ్రీజ సోలో ఫైట్.. బిగ్ బాస్ భలే టాస్క్ పెట్టారుగా!

Kavitha: దగాపడ్డ ఉద్యమకారుల్లో మొదటి వరుసలో నేనే ఉంటా.. కవిత కీలక వ్యాఖ్యలు

Nuclear Weapons Test: ట్రంప్ మరో సంచలనం.. 30 ఏళ్ల తర్వాత అణు పరీక్షలు.. అమెరికా వ్యూహాం ఏంటి?