Mahesh Kumar Goud (imagecredit:swetcha)
Politics

Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ కీలకం.. స్ట్రాటజీ ప్లే చేయాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ రెండూ సమన్వయమై ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ఆయన గాంధీభవన్ లో జరిగిన పీఏసీ మీటింగ్ లో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. చేసిన పనులను కూడా ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకువెళ్లలేకపోతున్నాని, ఇక నుంచి దీన్ని స్పీడప్ చేయాలన్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కీలకమైనవన్నారు. తప్పనిసరిగా విజయం సాధించాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇక దేశంలో ఓట్ చోరీ పెద్దఎత్తున జరిగిందన్నారు. బీజేపీ(BJP) ఓట్ చోరీ తోనే మూడో సారి గెలిచిందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ విషయంలో సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి ప్రజల్లో ఉద్యమాన్ని చేపట్టారన్నారు. దీనిపై రాష్ట్రంలో విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.

స్థానిక సంస్థలు ఎన్నికల్లో

ప్రజల్లో ఓట్ చోరిపై చర్చించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన అద్భుతమైన ఫలితాలు ఇస్తుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం లాంటి కార్యక్రమాలకు మంచి స్పందన వస్తున్నాయన్నారు. టీపీసీసీ(TPCC) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలు బ్రాహ్మరథం పడుతున్నారన్నారు. ఇవే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అవకాశంగా మారనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఒక దుష్ప్రచారం చేస్తూ బీఆర్ ఎస్(BRS).. రైతుల్లో ఒక భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తుందని పీసీసీ చీఫ్​ మండిపడ్డారు. దీన్ని తిప్పికొట్టాల్సిందేనని చెప్పారు.

Also Read: Student Shoots Teacher: చెంపపై కొట్టిన టీచర్‌కు.. బుల్లెట్ దింపిన 9వ తరగతి విద్యార్థి.. ఎక్కడంటే?

తెలంగాణ ప్రజాస్వామ్య వాదీ

గాంధీభవన్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) అధ్యక్షతన పీఏసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఓట్ చోరీ కి సంబంధించిన ప్రచార లోగో ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Menakshi Natarajan), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhati vikramarak), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kuar Reddy) పీఏసీ సభ్యులు ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కు చెందిన ప్రజాస్వామ్య వాదీ, రాజ్యాంగ నిపుణులు జస్టీస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy) ని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేసిందన్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కషన్ చేశారు. హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఒక్కొనే త తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు

ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో(Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేయాలని, ఇందుకు గ్రౌండ్ లెవల్ లోని కార్యకర్తల టీమ్స్ రెడీగా ఉండాలన్నారు. ప్రజాపాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపదుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తేనే, ఎన్నికల్లో మేలు జరుగుతుందని వివరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం. గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయి లో పెండింగ్ లో ఉన్న కమిటీల నిర్మాణం పై పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో అభిప్రాయాలను తెలియజేశారు.

Also Read: Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు