Suravaram Sudhakar Reddy: (image credit: twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కొండ్రావుపల్లికి చెందిన సురవరం, 1942 మార్చి 25న జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2012 నుంచి 2019 మధ్య సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. సుధాకర్ రెడ్డి ఉస్మానియా కాలేజీ నుంచి బీఏ పట్టా పొందారు. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఈయనకు 1974లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. సురవరం తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు.

 Also Read: Kota Srinivasa Rao’s wife: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. ఆయన భార్య మృతి

ప్రముఖుల సంతాపం

సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నల్లగొండ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. రెండు సార్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన సురవరం గొప్ప నాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడని కోల్పోయామని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, నిబద్దత, క్రమశిక్షణ ఆయన సొంతమని అన్నారు. కమ్యూనిస్ట్ రాజకీయాల్లో అజాత శత్రువుగా పని చేశారని చెప్పారు.

జాతీయ స్థాయిలో కీలక నేత

సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహబూబ్ నగర్‌లో పుట్టి జాతీయ స్థాయిలో కీలక నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ, ‘‘సురవరం శుక్రవారం రాత్రి 9 గంటలకు మరణించారని తెలిసి షాక్‌కు గురయ్యాను. పార్టీలో నా ఎదుగుదలకు ప్రతి సందర్భంలోనూ ప్రోత్సహించారు. మా కుటుంబానికి అతి సన్నిహితులు. వారి మరణం సీపీఐకి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి, ముఖ్యంగా నాకు, మా కుటుంబానికి తీరని లోటు. సురవరం మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా’’ అని అన్నారు.

 Also Read: Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!