Kota vs Anasuya
ఎంటర్‌టైన్మెంట్

Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?

Kota vs Anasuya: రెండు మూడు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోట నామస్మరణతో నిండిపోయింది. ఏ పాత్రకైనా న్యాయం చేయగల అతికొద్ది మంది నటులలో కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒకరు. అలాంటి నటుడు ఇక లేరని తెలిసి ఎందరో బాధపడ్డారు. మరెందరో నటనకు పెట్టని కోట అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. వెండితెరపై ఎన్నో తరహా పాత్రలలో నటించి, తన మార్క్ మ్యానరిజంతో స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న కోట.. ఎస్వీఆర్, రావు గోపాలరావు, కైకాల తర్వాత స్థానాన్ని కొన్ని దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపించారు. కోట లేకపోయినా, ఆయన నటించిన పాత్రలు, ఆ పాత్రల ద్వారా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోట చేసిన పాత్రని.. ఈ ప్రపంచం ఉన్నంతకాలం గుర్తు పెట్టుకుంటుంది. పిసినారి అనగానే లక్ష్మీపతి పాత్రే గుర్తొస్తుంది. అలాంటి పాత్రలు ఎన్నో కోట అమ్ములపొదిలో నిలిచాయి. కాకపోతే, నటుడిగా ఎంత హైట్స్ చూశారో.. కాంట్రవర్సీలలోనూ ఆయన అంతే ముందున్నారు.

Also Read- Star Heroine: 50 సెకన్ల కోసం ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఒకసారి క్యాస్ట్ గురించి, మరోసారి ఇతర భాషల విలన్లను ఉద్దేశించి, రాజకీయ గొడవలు, రాజమౌళి సినిమాపై చేసిన వ్యాఖ్యలు.. ఇలా ఒకటేమిటి? ఎప్పుడూ కోటపై కాంట్రవర్సీ నడుస్తూనే ఉండేది. ఈ కాంట్రవర్సీలలో గ్లామర్ డాల్ అనసూయ (Anasuya)ను వదిలిపెట్టలేదు కోట. వారిద్దరి మధ్య అప్పట్లో చిన్నపాటి యుద్ధమే నడిచింది. అనసూయని డైరెక్ట్‌గా పేరుతో కోట కామెంట్స్ చేస్తే.. అనసూయ మాత్రం కోట పేరు ఎత్తకుండా చాలా పెద్ద మాటలే అంది. అప్పట్లో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. మరీ ముఖ్యంగా కోట పెద్దరికంతో మంచిగా డ్రస్ వేసుకోమని చెబితే.. ఆయనని తాగుబోతూ అంటూ అనసూయ అనడంపై పెద్ద రచ్చే జరిగింది. అయినా సరే అనసూయ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Also Read- Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్

అసలేం జరిగిందంటే.. ఓ మీడియా సమావేశంలో అనసూయ ప్రస్తావన రాగా.. ‘ఆమె ఎవరో నాకు తెలియదు’ అన్నారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత అనసూయ నటనను మెచ్చుకున్న కోట.. ఆమె ధరించే దుస్తులే తనకు నచ్చవని వ్యాఖ్యానించారు. దీనికి అనసూయ ఘాటుగా స్పందించింది. ఆమె సోషల్ మీడియా వేదికగా కోట పేరు ప్రస్తావించకుండా.. ‘‘ఓ సీనియర్ నటుడు నా వస్త్రధారణపై అసహనం వ్యక్తపరిచినట్లుగా నా దృష్టికి వచ్చింది. అంత అనుభవం ఉన్న నటుడు ఇంత నీచంగా మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఇది అత్యంత బాధాకరం. ఎవరు ఎలాంటి దుస్తులు ధరిస్తారనేది అది వారి వ్యక్తిగతమైన విషయం. వృత్తి పరంగా, ప్రామాణికతకు అనుగుణంగా వేసుకునే దుస్తుల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మంచిది కాదు’’ అని సీరియస్ అయిన అనసూయ, అంతటితో ఆగకుండా.. ‘అయినా మందు తాగుతూ, అసభ్య దుస్తులతోనే పేరు తెచ్చుకున్న ఆ సీనియర్ నటుడు అలా మాట్లాడటం విచారకరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అంతే, అప్పటి నుంచి కోట వర్సెస్ అనసూయ అనేలా ఇండస్ట్రీలో కొందరు సృష్టించేశారు. అయినా సరే, ఇవేమి మనసులో పెట్టుకోకుండా, కోటకు అనసూయ నివాళులు అర్పించడం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు