Kota Srinivasa Rao’s wife: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. సోమవారం (ఆగస్ట్ 18) మృతి చెందారు. ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా వరుస మరణాలతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. వారి వివరాలు ఎక్కువగా బయటకు రాలేదు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు కూడా నటుడనే విషయం తెలిసిందే. అతను ఎక్కువగా టీవీ సీరియల్స్‌లో నటించారు.
Also Read- VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్యకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!
కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట ఉన్నప్పుడు కూడా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాంటి టైమ్‌లో భర్త కోట మరణం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. మాములుగా ఆమె హెల్త్ బాగోదని అంటుంటారు. అప్పట్లో తన తల్లి మరణ వార్త విని ఆమె డిస్టర్బ్ అయ్యారని, దాదాపు 30 సంవత్సరాల వరకు ఎవరినీ గుర్తు కూడా పట్టలేదనేలా ఆ మధ్య టాక్ నడిచింది. అలాంటి రుక్మిణి తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక, ఇబ్బంది పడుతూ.. సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది.
నెల రోజులలోనే..
లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు 13 జూలై 2025న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన దాదాపు నెలరోజులకే ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి మృతి వార్త తెలిసిన వాళ్లంతా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
Also Read- Swetcha Special story: కోట్ల విలువ చేసే భూములు హాం ఫట్.. విచ్చల విడిగా అనుమతులిచ్చిన అధికారులు!
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ.. నటన వైపు అడుగులు వేశారు. 1966లో ఆయనకు రుక్మిణితో వివాహమైంది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన కోట శ్రీనివాసరావు.. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కలిపి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా.. ఇలా వివిధ పాత్రలను పోషించి, తన బహుముఖ నటనను ప్రదర్శించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
