shreyas iyer
Viral, లేటెస్ట్ న్యూస్

Sanjay Manjrekar: శ్రేయస్ అయ్యర్ విషయంలో సెలక్టర్లపై మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

Sanjay Manjrekar: యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్ 2025కు భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. క్రికెట్ ప్రపంచం నుంచి అయ్యర్‌కు అసాధారణమైన సపోర్ట్ లభిస్తోంది. అయ్యర్‌కు మద్దతు పలుకుతున్నవారి జాబితాలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కూడా చేరారు. ఆసియా కప్‌కు టీమ్ ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్టర్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఒక ఫార్మాట్‌లో మంచిగా ఆడిన ప్లేయర్‌ను మరో ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయడం కొత్తమీ కాదు. నేను చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. ఎవరో టెస్ట్ మ్యాచుల్లో బాగా రాణించారని, అతడిని టీ20 జట్టులోకి తీసుకోవడం నాకు అస్సలు లాజిక్‌గా అనిపించడం లేదు. క్రికెట్ స్వభావ రీత్యా ఇది అస్సలు సరిపోదు. ఇందులో ఎలాంటి అర్థం లేదు’’ అని సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయన రాసుకొచ్చారు.

నిజంగా షాకింగ్ పరిణామం

శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్ టీ20 జట్టులోకి తీసుకోకపోవడం నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోందని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ‘‘అయ్యర్‌ను తొలుత జట్టులోంచి తొలగించినప్పుడు సరైన కారణం ఉంది. అది నేను కూడా ఒప్పుకుంటాను. దేశీవాళీ క్రికెట్ పట్ల అయ్యర్ తగిన నిబద్ధత చూపలేదు కాబట్టి అప్పుడు పక్కనపెట్టారు. ఆ నిర్ణయం శ్రేయస్‌పై ఎవరూ ఊహించని విధంగా ప్రభావాన్ని చూపింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చోటు ఇస్తే బరిలోకి దిగి జీవితంలో ఎప్పుడూ లేనంత గొప్పగా రాణించాడు. పూర్తిగా కొత్త ప్లేయర్‌గా మాదిరిగా అనిపించాడు’’ అని మంజ్రేకర్ మెచ్చుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో అయ్యర్ ఏ తప్పూ చేయకపోయినా, నిలకడగా రాణించినా, అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యంగా కలిగిస్తోందని మండిపడ్డారు.

Read Also- Jaishankar on Trump: డొనాల్డ్ ట్రంప్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ డేరింగ్ కామెంట్స్

జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికైన తర్వాత ఒక్క దశలో కూడా వెనుకబడ్డ సూచనలు లేవని, ఆ ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగించాడని మంజ్రేకర్ ప్రస్తావించారు. ‘‘50కి పైగా సగటు, 170 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో గేమ్ ఛేంజర్‌గా ఆడిన శ్రేయర్ అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ ముగించాడు. అలాంటి ఆటగాడికి ఇచ్చిన బహుమతి జట్టులో చోటివ్వకపోవడం!’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యర్‌కు జరిగింది అన్యాయమే
ఇటీవల టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిని పక్కనబెట్టి, టెస్ట్ క్రికెట్‌లో రాణించిన ఆటగాడిని టీ20 జట్టులోకి తీసుకోవడం తప్పు. టీ20 కోసం జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు, ఆ ఫార్మాట్‌లోనే రాణించిన ఆటగాడినే ఎంపిక చేయాలి. టెస్ట్ క్రికెట్‌లో రాణించారనే కారణంతో ఒక ఆటగాడికి టీ20 ఫార్మాట్‌లో ఛాన్స్ ఇవ్వడమే కాకుండా, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం అంటే అన్యాయమే” మంజ్రేకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also- UP Tragedy: డెలివరీలో బిడ్డ మృతి.. డెడ్‌బాడీని తీసుకొని కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లిన తండ్రి.. కలెక్టర్ నిర్ణయం ఇదే

కాగా, ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 604 పరుగులు బాదాడు. స్ట్రైక్ రేట్ 175కి పైగా, సగటు 50.33గా ఉంది. పంజాబ్ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఏకంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ, ఆసియా కప్‌కు అతడిని ఎంపిక చేయలేదు. కనీసం ఐదుగురు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేయగా, అందులో కూడా చోటివ్వలేదు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ ఈ మధ్యకాలంలో టీ20 ఫార్మాట్‌లో అంత బాగా రాణించలేకపోయినప్పటికీ, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 750కు పైగా పరుగులతో రాణించాడనే కారణంగాతో సెలక్టర్లు అతడిని ఆసియా కప్‌ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్