Botsa Satyanarayana: కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్.. బొత్స ఫైర్
Botsa Satyanarayana (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Botsa Satyanarayana: కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్.. దోపిడీలు పెరిగిపోయాయి.. బొత్స ఫైర్

Botsa Satyanarayana: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోమని రాష్ట్రాన్ని రాసి ఇచ్చేశారని బొత్స ఆరోపించారు.

ప్రభుత్వానికి డెడ్ లైన్
రాష్ట్రంలో అర్హత కలిగిన దివ్యాంగుల పెన్షన్లు సైతం తొలగిస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పెన్షన్ కోల్పోయిన దివ్యాంగులను తీసుకొని త్వరలోనే కలెక్టర్లను కలుస్తామని అన్నారు. ఈ నెల 30 లోపు సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్ లోకేష్ చెప్పారు. ఇప్పుడు 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది’ అని బొత్స ప్రశ్నించారు.

Also Read: Viral Video: రూ.1.8 కోట్ల జీతంతో ఉద్యోగం.. తీరా రోడ్ల వెంట ఐస్‌క్రీమ్ అమ్ముకుంటున్న ఉద్యోగి!

పవన్‌కు ఆ బాధ్యత లేదా?
ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన (Janasena) సమావేశంలో స్టీల్ ప్లాంట్ పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వైఖరి ఏంటో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్ పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం’ అని బొత్స చెప్పుకొచ్చారు.

Also Read: Kukatpally Murder Case: నా కూతుర్ని చంపినట్లు.. బాలుడి పేరెంట్స్‌కు ముందే తెలుసు.. సహస్ర తండ్రి

ఉపరాష్ట్రపతి ఎన్నికపై..
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్యా బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైసీపీ (YSRCP) వ్యతిరేకమని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind), వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు తమ పార్టీ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా పనిచేసిన కాలంలోనే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. మరి చంద్రబాబు ఇండియా కూటమికి ఫేవర్ చేస్తారా?’ అని బొత్స ప్రశ్నించారు.

Also Read: Viral Video: నిర్మానుష్య వీధిలో వెళ్తోన్న వ్యక్తి.. మీదకు దూసుకొచ్చిన 7 కుక్కలు.. తర్వాత జరిగిందిదే!

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య