Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: నిర్మానుష్య వీధిలో వెళ్తోన్న వ్యక్తి.. మీదకు దూసుకొచ్చిన 7 కుక్కలు.. తర్వాత జరిగిందిదే!

Viral Video: మహారాష్ట్రలోని పింప్రీ చించ్వడ్‌ (Pimpri Chinchwad)లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఇవాళ (ఆగస్టు 23) తెల్లవారుజామున నిర్మానుష్య వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ఏకంగా 7 కుక్కలు దాడికి యత్నించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలుకూ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 3 నిమిషాల పాటు ఆ ఏడు కుక్కలతో పోరాడిన బాధితుడు.. ధైర్య సాహసాలు ప్రదర్శించి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. బాధితుడు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడి వెనుక నుంచి ఏడు కుక్కలు పెద్దగా అరుస్తూ దూసుకొచ్చాయి. ఆపై అతడ్ని కరిచే ప్రయత్నం చేశాయి. దీంతో అప్రమత్తమైన అతడు.. పక్కనే ఉన్న బైక్ వెనక్కి వెళ్లిపోయాడు. అనంతరం బైక్ ను కుక్కల మీదకు నెట్టాడు. ఆపై ఒక ప్రకటన బోర్డును తనకు అడ్డుగా పెట్టుకొని.. కుక్కల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వీధి కుక్కలతో అతడి పోరాటం ఇలా మూడు నిమిషాల పాటు కొనసాగింది.

Also Read: BC Reservation Bill: బీసీలకు మహర్దశ.. రాష్ట్రంలో అదనంగా 23,973 పదవులు.. పర్‌ఫెక్ట్ ప్లానింగ్!

కేకలతో బయటకొచ్చిన స్థానికులు
అయితే కుక్కలు చుట్టుముట్టడంతో బాధితుడు పెద్దగా కేకలు వేశాడు. వీధిలో పెద్ద ఎత్తున కేకలు, చప్పుళ్లు వస్తుండటంతో ఇళ్లలోని వారు వెంటనే నిద్రలేచి బయటకు వచ్చారు. యువకుడిపై దాడికి యత్నిస్తున్న కుక్కలను వారు తరిమివేశారు. కుక్క కాటుతో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు కాబట్టే అతడి ప్రాణాలకు ముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు. వీధి కుక్కలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. తాజా ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: Lord Ganesha Tusk: వినాయకుడి ఏకదంతం రహస్యం ఇదే.. ప్రతీ హిందువు తప్పక తెలుసుకోవాలి!

వీధి కుక్కలపై సుప్రీం తాజా తీర్పు
వీధి కుక్కల అంశంపై న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వీధి కుక్కల షెల్టర్ల నుంచి బయట వదిలిపెట్టవచ్చని పేర్కొంది. అయితే ఇలా చేసే ముందు వాటికి టీకాలు వేయాలని సూచించింది. ఆ తర్వాతనే తీసుకొచ్చిన ప్రాంతాల్లో వాటిని వదిలివేయవచ్చని స్పష్టం చేసింది. దూకుడు స్వభావం కలిగిన శునకాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. వాటితో పాటు రాబిస్ లక్షణాలు ఉన్న వాటికి తప్పనిసరిగా టీకాలు వేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కలకు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టవద్దని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ప్రత్యేకంగా ఆహారం పెట్టే ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రోడ్లపై కుక్కలకు ఆహారం పెడుతున్నవారిపై చర్యలు తీసుకోబడతాయని కోర్టు హెచ్చరించింది.

Also Read: Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ