Stray Dog vs Leopard: శునకాలకు సంబంధించి నిత్యం ఓ సామెత మన చెవిన పడుతూనే ఉంటుంది. ‘ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుంది’ అని మనుషులు తమ దయనందిన జీవితంలో తరుచూ ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే ఓ కుక్క విషయంలో ఈ సామెత అక్షరాల రుజువైంది. ఏకంగా చిరుతతో పోరాడి.. దానిపై శునకం పై చేయి సాధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుక్క ధైర్య సాహసాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర నాసిక్‌లో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వీధి కుక్కపై చిరుత దాడికి యత్నించింది. ఈ క్రమంలో రెండింటి మధ్య పోరాటం జరగ్గా.. అందులో శునకం పై చేయి సాధించింది. తద్వారా చిరుతను 300 మీటర్ల దూరం వరకు ఊడ్చుకెళ్లింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
సాక్షులు ఏమంటున్నారంటే?
చిరుత, కుక్క పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కీలక విషయాలు వెల్లడించారు. చిరుత సమీపంలోని అడవి నుంచి తమ ప్రాంతంలోకి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో కుక్క వెంటనే దానిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. చిరుత మెడను పట్టుకొని కొద్దిదూరం లాక్కెళ్లిందని చెప్పారు. మరోవైపు అటవీశాఖ అధికారులు సైతం ఘటనపై స్పందించారు. గాయల తర్వాత చిరుత సమీప పొల్లాలోకి వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, గ్రామస్థులు, పశువులు సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
నెటిజన్ల రియాక్షన్
ప్రస్తుతం వీధి కుక్కలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకోవడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న తీర్పులు వస్తోన్న నేపథ్యంలో చిరుత బారి నుంచి ఓ శునకం గ్రామాన్ని రక్షించడం హైలెట్ గా నిలుస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుందన్న సామెత.. ఈ కుక్క విషయంలో నిజమైందని పేర్కొంటున్నారు. తన కంటే ఎంతో బలమైన చిరుతను అది ఎదుర్కొని పడగొట్టడం నిజంగా గ్రేట్ అంటున్నారు.
📍Maharashtra | Video: In Dog vs Leopard Clash In Nashik, An Unlikely Winner pic.twitter.com/7ICRniyBLE
— NDTV (@ndtv) August 22, 2025
Also Read: Kukatpally Murder Case: సహస్ర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకుడు ఓ మైనర్.. పక్కా ప్లాన్‌తో..
వీధి కుక్కలపై సుప్రీం తాజా తీర్పు
వీధి కుక్కల అంశంపై న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వీధి కుక్కల షెల్టర్ల నుంచి బయట వదిలిపెట్టవచ్చని పేర్కొంది. అయితే ఇలా చేసే ముందు వాటికి టీకాలు వేయాలని సూచించింది. ఆ తర్వాతనే తీసుకొచ్చిన ప్రాంతాల్లో వాటిని వదిలివేయవచ్చని స్పష్టం చేసింది. దూకుడు స్వభావం కలిగిన శునకాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. వాటితో పాటు రాబిస్ లక్షణాలు ఉన్న వాటికి తప్పనిసరిగా టీకాలు వేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కలకు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టవద్దని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ప్రత్యేకంగా ఆహారం పెట్టే ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రోడ్లపై కుక్కలకు ఆహారం పెడుతున్నవారిపై చర్యలు తీసుకోబడతాయని కోర్టు హెచ్చరించింది.